ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

bookie ఆస్తులను సీజ్ చేసిన Agra పోలీసులు..

ABN, First Publish Date - 2022-06-07T22:10:20+05:30

Uttarapradesh లో నేరస్థులు, గ్యాంగ్‌స్టర్లపై పోలీసుల నియంత్రణ చర్యలు, దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఆగ్రాలో బుకీ(bookie )గా పేరుబడ్డ సన్నీ కపాడి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆగ్రా : ఉత్తరప్రదేశ్‌లో(Uttarapradesh) లో నేరస్థులు, గ్యాంగ్‌స్టర్లపై పోలీసుల నియంత్రణ చర్యలు, దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఆగ్రాలో బుకీ(bookie )గా పేరుబడ్డ సన్నీ కపాడియా అనే వ్యక్తికి చెందిన రూ.3.20 కోట్ల విలువైన ఆస్తులను పోలీసులు సీజ్ చేశారు. నిందితుడిపై ఇప్పటికే అనేక కేసులు ఉన్నాయి. బెట్టింగ్ నిర్వహిస్తూ ఆస్తులు కూడబెట్టడంతో గ్యాంగ్‌స్టర్ చట్టం కింద అతడి ఆస్తులను సీజ్ చేశామని ఆగ్రా ఎస్పీ వికాస్ కుమార్ చెప్పారు. గ్యాంగ్‌స్టర్ చట్టంలోని సెక్షన్ల కింద నిందితుడు కపాడియాపై తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. వేర్వేరు పోలీస్ స్టేషన్లలో ఇతడిపై ఉన్న కేసులపై దర్యాప్తు ప్రారంభమైందని ఆయన వివరించారు.


బ్యాంక్ అకౌంట్లు, 3 ఇళ్లు సీజ్...

నిందిత బుకీ సన్నీ కపాడియాపై సుమార్ 16 కేసుల వరకు ఉన్నాయి. అతడికి చెందిన 3 ఇళ్లు, ఒక షాపు, 3 బ్యాంకు ఖాతాలను సీజ్ చేశాం. వీటన్నింటి విలువ రూ.3.20 కోట్ల వరకు ఉంటుందని ఎస్పీ వికాస్ కుమార్ పేర్కొన్నారు. కాగా ఉత్తరప్రదేశ్‌లో ఈ ఏడాది మార్చిలో సీఎం యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath) ప్రభుత్వం(Govt) రెండవ దఫా అధికారంలోకి వచ్చాక నేరస్థులు, గ్యాంగ్‌స్టర్లపై ఉక్కుపాదం మోపుతోంది. గ్యాంగ్‌స్టర్ చట్టం(Gangstar act) కింద మార్చి నుంచి ఇప్పటివరకు నేరస్థులు, గ్యాంగ్‌స్టర్లకు చెందిన మొత్తం రూ.661 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేసింది. కాగా నేరపూరిత ప్రక్రియల ద్వారా కూడబెట్టిన ఆస్తులను పోలీసులు అటాచ్ చేసేందుకు గ్యాంగ్‌స్టర్ చట్టం వీలుకల్పిస్తోంది. ఈ చట్టం కింద మార్చి నుంచి ఇప్పటివరకు మొత్తం 700 మంది మాఫియా డాన్లు, నేరస్థులపై కేసులు నమోదయ్యాయని గణాంకాలు చెబుతున్నాయి.

Updated Date - 2022-06-07T22:10:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising