ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రక్షణ దళాల్లో చేరే యువతకు శుభవార్త...Agnipath recruitment scheme

ABN, First Publish Date - 2022-06-14T13:18:44+05:30

రక్షణ దళాల్లో చేరే యువతకు దేశ రక్షణమంత్రిత్వశాఖ శుభవార్త వెల్లడించింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ:రక్షణ దళాల్లో చేరాలనుకునే యువతకు దేశ రక్షణమంత్రిత్వశాఖ శుభవార్త వెల్లడించింది. రక్షణ దళాల్లో చేరడం కోసం అగ్నిపథ్ పేరిట కొత్త రిక్రూట్‌మెంట్ పథకాన్ని కేంద్రం మంగళవారం ప్రకటించనుంది. ఈ పథకం కింద కేవలం నాలుగు సంవత్సరాల పదవీకాలానికి మాత్రమే రక్షణదళాల్లోకి జవాన్లుగా యువతను నియమించనున్నారు.ఈ పథకం వివరాలను ప్రకటించేందుకు ముగ్గురు ఆర్మీ చీఫ్‌లు నేడు విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తారు.సైనికుల రిక్రూట్‌మెంట్ కోసం అగ్నిపథ్ పథకం గురించి త్రివిధ దళాల అధిపతులు రెండు వారాల క్రితం ప్రధాని నరేంద్ర మోదీకి వివరించారు. ఇది స్వల్పకాలిక పదవీకాలం కోసం దళాలలోకి యువతను చేర్చడానికి మార్గం సుగమం చేయనుంది.


ఈ పథకాన్ని సైనిక వ్యవహారాల శాఖ ప్లాన్ చేసి అమలు చేస్తోంది. కొత్త స్కీమ్ అగ్నిపథ్ కింద యువకులు నాలుగు సంవత్సరాల పాటు దళాలలో చేరి దేశానికి సేవ చేస్తారు. నాలుగు సంవత్సరాల ముగింపులో దాదాపు 80 శాతం మంది సైనికులు విధుల నుంచి వైదొలుగుతారు. వారు తదుపరి ఉపాధి మార్గాల కోసం సాయుధ దళాలు సహాయం అందిస్తాయి. రిక్రూట్ అయిన యువతలో అత్యుత్తమమైన వారు ఖాళీలు అందుబాటులో ఉన్నట్లయితే, వారి సేవలను కొనసాగించే అవకాశాన్ని పొందవచ్చు. 


Updated Date - 2022-06-14T13:18:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising