ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అగ్నిపథ్‌.. ఆ దేశాలే స్ఫూర్తి

ABN, First Publish Date - 2022-06-20T09:27:03+05:30

సైన్యంలో కొత్తగా తీసుకొచ్చిన అగ్నిపథ్‌ పథకంపై దేశవాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమెరికా, రష్యా, చైనా, ఇజ్రాయిల్‌లో ఇలా..


న్యూఢిల్లీ, జూన్‌ 19: సైన్యంలో కొత్తగా తీసుకొచ్చిన అగ్నిపథ్‌ పథకంపై దేశవాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. నాలుగేళ్లు సైన్యంలో పనిచేసిన తర్వాత తమను ఇంటికి పంపించేస్తే, ఆ తర్వాత తమ పరిస్థితి ఏమిటని యువత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే పలు దేశాల్లో నియామకాల ప్రక్రియను పరిగణనలోకి తీసుకొని, మనదేశ సాయుధ దళాల అవసరాలకు అనుగుణంగా పథకాన్ని తీసుకొచ్చామని ప్రభుత్వం చెబుతోంది. ఆయా దేశాల్లో నియామక ప్రక్రియ ఇలా ఉంది.


అమెరికా: అమెరికాలో సాయుధ దళాలకు అవసరమైనప్పుడు ఎంపిక చేసుకునేందుకు వీలుగా 18-25 ఏళ్ల మధ్య వయసున్న యువకులంతా తప్పనిసరిగా పేర్లు నమోదు చేసుకోవాలి. ఎంపికైనవారు నాలుగేళ్లు సైన్యంలో సేవలందించాలి. ఆ తర్వాత పూర్తికాలం సైన్యంలో కొనసాగొచ్చు. వీరికి 20 ఏళ్లు సైన్యంలో కొనసాగిన తర్వాత పింఛన్‌, ఇతర ప్రయోజనాలు లభిస్తాయి. నాలుగేళ్ల కాంట్రాక్టు తర్వాత 35 వేల డాలర్ల క్విక్‌ షిప్‌ బోనస్‌ ఇవ్వాలని తాజాగా నిర్ణయించారు. ఈనెల 17 నుంచే ఇది అమల్లోకి వచ్చింది. 


చైనా: చైనా సైన్యంలో 21.80 లక్షల మంది ఉన్నారు. 18-22 ఏళ్ల మధ్య వయసున్న యువకులంతా తప్పనిసరి మిలటరీ సర్వీసు కోసం పేర్లు నమోదు చేసుకోవాల్సిందే. మూడేళ్లు తప్పనిసరిగా పనిచేయాలి. ఆ తర్వాత స్వచ్ఛందంగా కొనసాగాలనుకునేవారి సర్వీసు కాలం 8 ఏళ్లు. 


ఇజ్రాయిల్‌: 18 ఏళ్ల వయసు దాటిన పౌరులంతా సాయుధ దళాల్లో పనిచేయాల్సిందే. దివ్యాంగులు, మానసిక వైకల్యం ఉన్నవారు, మతాచారాలు పాటించే మహిళలు, వివాహితులకు మినహాయింపు ఉంటుంది. యువకులు 32 నెలలు, యువతులు 24 నెలలు సైన్యంలో పనిచేయాలి.


రష్యా: నిర్బంధ, కాంట్రాక్టు, ప్రత్యామ్నాయ, ప్రభుత్వ పౌర సేవ అనే నాలుగు సర్వీసు మోడళ్లు రష్యాలో అమలవుతున్నాయి. నిర్బంధ మోడల్‌లో ఏప్రిల్‌ 1 నుంచి జూలై 15 వరకు, అక్టోబర్‌ 1 నుంచి డిసెంబరు 31 వరకు ఏటా రెండు విడతలుగా సైన్యంలో పనిచేయాలి. 18 నుంచి 27 ఏళ్ల మధ్య వయసులో మొత్తం 12 నెలల సర్వీసును పూర్తి చేయాలి. 2020 మార్చి గణాంకాల ప్రకారం ఈ దేశంలో నిర్బంధ సైనికులు 2.25 లక్షల మంది, కాంట్రాక్టు సైనికులు 4.05 లక్షల  మంది ఉన్నారు.


జర్మనీ: నిర్బంధంగా సైన్యంలో పనిచేసే విధానాన్ని 2011 నుంచి నిలిపివేశారు. ప్రస్తుతం ఎవరైనా స్వచ్ఛందంగా సైన్యంలో చేరవచ్చు. వీరికి 23 నెలల ప్రాథమిక సర్వీసు కాలం ఉంటుంది.

Updated Date - 2022-06-20T09:27:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising