ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అగ్నిపథ్‌లో చేరేవారు ఆ హామీ ఇవ్వాల్సిందే: అనిల్‌పురి

ABN, First Publish Date - 2022-06-20T01:43:38+05:30

అగ్నిపథ్ పథకంలో ఇదొక కీలక అంశమని ఆయన అన్నారు. హింసాత్మక నిరసనలు చేసేవారికి అగ్నిపథ్ పథకంలో కేంద్రం రాయితీలు ఇవ్వలేదని అనిల్‌పురి అన్నారు. ఈ సూచనలు ఇప్పటికే అమలులో ఉన్నట్లు ఆయన తెలిపారు. సాయుధ దళాలు క్రమశిక్షణతో ఉంటాయని, క్రమశిక్షణ కలిగిన అభ్యర్థుల దరఖాస్తుదారులు మాత్రమే స్వీకరించబడతాయని పేర్కొన్నారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: అగ్నిపథ్‌లో చేరే అభ్యర్థులు ఎలాంటి నిరసనల్లో పాల్గొననట్లు ధ్రువపత్రం ఇవ్వాలని మిలటరీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి లెఫ్టినెంట్ జనరల్ అనిల్‌పురి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ పథకంపై మిలిటరీలో చేరాలనుకునే యువత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేయడం విశేషం. మిలిటరీలో చేరే యువతకు జోష్, హోష్ ఉండాలని.. ఈ రెండింటికీ సమ ప్రాధాన్యం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అగ్నిపథ్ పథకంలో ఇదొక కీలక అంశమని ఆయన అన్నారు. హింసాత్మక నిరసనలు చేసేవారికి అగ్నిపథ్ పథకంలో కేంద్రం రాయితీలు ఇవ్వలేదని అనిల్‌పురి అన్నారు. ఈ సూచనలు ఇప్పటికే అమలులో ఉన్నట్లు ఆయన తెలిపారు. సాయుధ దళాలు క్రమశిక్షణతో ఉంటాయని, క్రమశిక్షణ కలిగిన అభ్యర్థుల దరఖాస్తుదారులు మాత్రమే స్వీకరించబడతాయని పేర్కొన్నారు. అయితే అగ్నిపథ్‌లపై ఇలాంటి నిరసనలను ఊహించలేదని అన్నారు.


ఈ పథకంపై ఆయన మాట్లాడుతూ అగ్నిపథ్ పథకం ఇప్పటికిప్పుడు తీసుకొచ్చినదీ ఏమీ కాదని, రెండేళ్లుపాటు సమగ్ర అధ్యయనం చేసిన అనంతరం దానిని తీసుకొచ్చినట్టు అనిల్‌పురి అన్నారు. ‘అగ్నిపథ్’పై త్రివిధ దళాధిపతులు సమగ్ర అధ్యయనం చేశారని పేర్కొన్నారు. అనుభవం, యువశక్తికి ప్రాధాన్యం ఇస్తామని, సైన్యంలోకి వచ్చి వెళ్లేందుకు అవకాశాలు పెంచామని అన్నారు. యువ జవానులు సైన్యంలోకి వస్తే సాంకేతికతను సమర్థంగా వినియోగిస్తారని అన్నారు. అగ్నివీరులు సైన్యంలో కొనసాగేందుకు అవకాశాలు ఉన్నాయన్నారు. కరోనా కారణంగా రెండేళ్లపాటు ఆర్మీ నియామకాలు జరగలేదని, ఈసారి ఎక్కువమంది సైన్యంలో నియమిస్తామని అనిల్‌పురి పేర్కొన్నారు.

Updated Date - 2022-06-20T01:43:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising