ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Delhi జేఎన్‌యూ గేటు వద్ద కాషాయ జెండాలు...హిందూసేన దుశ్చర్య

ABN, First Publish Date - 2022-04-15T16:48:40+05:30

రామనవమి ఘర్షణ తర్వాత ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) ప్రధాన గేటు వద్ద హిందూ సేన శుక్రవారం కాషాయ జెండాలను ఎగురవేసింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: రామనవమి ఘర్షణ తర్వాత ఢిల్లీలోని  జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ)  ప్రధాన గేటు వద్ద హిందూ సేన శుక్రవారం కాషాయ జెండాలను ఎగురవేసింది.హిందూసేన కార్యకర్తలు జేఎన్‌యూ క్యాంపస్ చుట్టూ కాషాయ రంగు పోస్టర్లను అతికించింది. ఏప్రిల్ 10వతేదీన రామనవమి సందర్భంగా జేఎన్‌యూ హాస్టల్ లో నాన్ వెజ్ ఫుడ్ వడ్డించకుండా ఏబీవీపీ సభ్యులు అడ్డుకున్నారు.దీంతో వామపక్ష విద్యార్థులకు, ఏబీవీపీ విద్యార్థులకు మధ్య ఘర్షణ జరిగింది.కొందరు విద్యార్థుల ఫిర్యాదు మేరకు గుర్తు తెలియని ఏబీవీపీ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏబీవీపీ సభ్యులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. శారీరకంగా వికలాంగుడైనప్పటికీ తనపై దాడి చేశాడని విద్యార్థి ఒకరు తెలిపారు.


ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తు జరిపిస్తామని, వర్శిటీలో శాంతిభద్రతలను కాపాడాలని వర్శిటీ అధికారులు కోరారు.జేఎన్ యూలో హిందూ సేన ఏర్పాటు చేసిన కాషాయరంగు జెండాలను తొలగించామని డీసీపీ సౌత్ వెస్ట్ మనోజ్ చెప్పారు. ఈ జెండాలు, పోస్టర్లు వేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీసీపీ చెప్పారు. 


Updated Date - 2022-04-15T16:48:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising