ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేను రాను బిడ్డో సర్కారు దవాఖానాకు...

ABN, First Publish Date - 2022-09-07T16:35:25+05:30

‘‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానాకు’’ అని ఓ సినీ కవి ప్రభుత్వ ఆసుపత్రుల్లో దుస్థితిని కళ్లకు కట్టినట్లు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాట్నా(బీహార్):‘‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానాకు’’ అని ఓ సినీ కవి ప్రభుత్వ ఆసుపత్రుల్లో దుస్థితిని కళ్లకు కట్టినట్లు నాడు రాసిన పాట బీహార్ రాష్ట్రంలోని ఈ సర్కారు ఆసుపత్రులను చూస్తే నిజమని తేటతెల్లమవుతోంది.భారీవర్షాలు(heavy rain) కురుస్తున్న నేపథ్యంలో బీహార్(bihar) రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల(hospital) ఇంటెన్సివ్ కేర్ యూనిట్(icu) లోకి మురుగునీరు(dirty water) రావడంతో రోగులు అల్లాడుతున్నారు.భారీ వర్షం వల్ల డ్రైనేజీ నుంచి మురుగు నీరు బీహార్‌లోని ప్రభుత్వ సబ్-డివిజన్ ఆసుపత్రిలోకి ప్రవేశించింది. 


బీహార్ రాష్ట్రంలోని హాజీపూర్ ఆసుపత్రిలో కూడా వరదనీరు ప్రవేశించింది.దీంతో అత్యవసర చికిత్స కోసం వచ్చిన రోగిని వరదనీటిలోనే స్ట్రెచరుపై రోగిని వైద్య సిబ్బంది ఆసుపత్రిలోకి తీసుకువెళుతున్న చిత్రం కనిపించింది. నలంద మెడికల్ కళాశాల ఆసుపత్రిలో కూడా వరదనీరు చేరింది. ఆసుపత్రి ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లోకి వరదనీరు రావడంతో రోగుల పడకల మధ్య చేపలు తిరిగాయి. 


ఆసుపత్రిలోని సిరంజీలు, బ్యాండేజ్ లు వరదనీటిలో తేలియాడాయి. మురుగునీరు ఆసుపత్రిలోకి ప్రవేశించడంతో అసలే రోగులు... ఆపై మురుగునీటి దుర్గంధంతో సతమతమయ్యారు.తమకు వచ్చిన రోగాలు నయం చేసుకునేందుకు సర్కారు ఆసుపత్రికి వస్తే...తమకు మురుగునీటిలో తేలియాడుతున్న ఆసుపత్రి వార్డులతో తమకు కొత్త రోగాలు వచ్చే దుస్థితి నెలకొందని రోగులు ఆవేదనగా చెప్పారు.   


Updated Date - 2022-09-07T16:35:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising