ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గత పాలకుల నిర్వాకం వల్లే

ABN, First Publish Date - 2022-03-05T07:08:35+05:30

వైద్య విద్యను అభ్యసించేందుకు పెద్దసంఖ్యలో భారత్‌ విద్యార్థులు విదేశాలకు వెళ్లడానికి గత ప్రభుత్వాల విధానాలే కారణమని ప్రధాని మోదీ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అధికసంఖ్యలో విదేశాలకు

వైద్య విద్యార్థులు

 ఉక్రెయిన్‌ నుంచి తిరిగి వచ్చిన 

 విద్యార్థులతో ప్రధాని మోదీ


లఖ్‌నవూ/న్యూఢిల్లీ, మార్చి 4: వైద్య విద్యను అభ్యసించేందుకు పెద్దసంఖ్యలో భారత్‌ విద్యార్థులు విదేశాలకు వెళ్లడానికి గత ప్రభుత్వాల విధానాలే కారణమని ప్రధాని మోదీ ఆరోపించారు. ‘‘గతంలో వైద్యవిద్యా విధానాలు సరిగా ఉంటే.. మీరంతా మెడిసిన్‌  చదవడానికి ఇతర దేశాలకు వెళ్లేవారు కాదు కదా?’’ అని విద్యార్థులతో అన్నారు. ఉక్రెయిన్‌ నుంచి తిరిగివచ్చిన వైద్యవిద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రధానిని వరాణసీలో కలిశారు. వైద్యవిద్యకు సంబంధించి పాత తప్పులను ప్రభుత్వం సవరిస్తోందని మోదీ ఈ సందర్భంగా వారికి చెప్పారు. ‘‘ఇంతకుముందు 300 నుంచి 400 మెడికల్‌ కాలేజీలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్య 700కి పెరిగింది. దీనివల్ల సీట్ల సంఖ్య 90 వేల నుంచి 1.5 లక్షలకు పెరిగింది’’ అని ప్రధాని వివరించారు. ప్రతి జిల్లాలోనూ ఒక మెడికల్‌ కాలేజీ ఏర్పాటుచేసేదిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. దీనివల్ల విద్యార్థులు ఇతర దేశాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదని, తల్లిదంద్రులు కూడా ఒత్తిడికి గురికానక్కర్లేదని ఆయన తెలిపారు. ఉక్రెయిన్‌ నుంచి స్వదేశానికి చేరినప్పటివరకు ఎదుర్కొన్న భయంకర అనుభవాలను విద్యార్థులు ప్రధానికి వివరించారు. ఉక్రెయిన్‌లో తాము ఎదుర్కొన్న కష్టాలపై ప్రధాని వద్ద కొంతమంది విద్యార్థులు ఆగ్రహం వ్యక్తంచేశారు. అయితే ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో విద్యార్థుల ఆగ్రహించడం సహజమేనని ప్రధాని చెప్పారు.

Updated Date - 2022-03-05T07:08:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising