ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Adgp, Dsp మధ్య రూ. 1.36 కోట్ల లావాదేవీలు

ABN, First Publish Date - 2022-07-15T17:41:42+05:30

సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల అక్రమాలకు సంబంధించి మరో వాస్తవం వెలుగులోకి వచ్చింది. అక్రమాల సూత్రధారులుగా ఉండే ఏడీజీపీ అమృత్‌పౌల్‌, డీఎస్పీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                     - మరో మూడురోజుల కస్టడీకి ఏడీజీపీ అమృత్‌పౌల్‌


బెంగళూరు, జూలై 14(ఆంధ్రజ్యోతి): సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల అక్రమాలకు సంబంధించి మరో వాస్తవం వెలుగులోకి వచ్చింది. అక్రమాల సూత్రధారులుగా ఉండే ఏడీజీపీ అమృత్‌పౌల్‌, డీఎస్పీ శాంతకుమార్‌ మధ్య రూ.1.36 కోట్ల లావాదేవీలు సాగినట్లు సీఐడీ పోలీసులు గుర్తించారు. అమృత్‌పౌల్‌కు చెందిన ఐఫోన్‌ను స్వాధీనం చేసుకున్న సీఐడీ అధికారులు అందులో సమాచారాన్ని పూర్తిగా డిలీట్‌ చేసినట్లు గుర్తించారు. బుధవారం ఫోన్‌ పాస్‌వర్డ్‌ చెప్పిన మేరకు మొబైల్‌ నుంచి సమగ్ర సమాచారం సేకరించేందుకు ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపారు. మొబైల్‌ నుంచి లభించిన ఆధారాలకు అనుగుణంగా విచారణ జరుపు తామన్నారు. ఈమేరకు పదిరోజుల కస్టడీ ముగిసిన మేరకు మరోసారి కోర్టు ముందు హాజరుపరచారు. పదిరోజులలో కేవలం ఐదురోజులు మాత్రమే విచారణలకు సహకరించారని మరో మూడురోజుల కస్టడీ అవసరమని కోరిన మేరకు న్యాయమూర్తి అందుకు అనుగుణంగానే తీర్పునిచ్చారు. 35వ నిందితుడైన ఏడీజీపీ అమృత్‌పౌల్‌ సూచించిన ఖాతాలకు 31వ నిందితుడైన డీఎస్పీ శాంతకుమార్‌ రూ.1.36 కోట్లు పంపిన ఆధారాలు లభించాయి. లావాదేవీలు నిర్ధారణ కావడంతో ఇద్దరు అధికారులు నిండా మునిగినట్లు అయ్యింది. కాగా అమృత్‌పౌల్‌ను ప్రతిరోజు కుటుంబ సభ్యులు, డాక్టర్‌తో కలిసేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన తరుపు న్యాయవాదుల ప్రతిపాదనలకు జడ్జి అంగీకరించారు. రోజు అరగంట పాటు కుటుంబ సభ్యులు కలిసేందుకు వీలు కల్పించగా ఆన్‌లైన్‌ పద్దతిన డాక్టర్‌ను సంప్రదించేందుకు వీలు కల్పిస్తూ న్యాయమూర్తి ఆదేశించారు.

Updated Date - 2022-07-15T17:41:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising