ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Shivaji: అడయార్‌లో శివాజీ విగ్రహం

ABN, First Publish Date - 2022-10-01T15:30:43+05:30

స్థానిక అడయార్‌లోని దివంగత సినీనటుడు నడిగర్‌ తిలకం శివాజీగణేశన్‌(Shivajiganeshan) స్మారక మండపంలోని ఆయన విగ్రహాన్ని రాష్ట్ర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                                       - నేడు స్టాలిన్‌ నివాళి


చెన్నై, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): స్థానిక అడయార్‌లోని దివంగత సినీనటుడు నడిగర్‌ తిలకం శివాజీగణేశన్‌(Shivajiganeshan) స్మారక మండపంలోని ఆయన విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆ మండపం ప్రవేశద్వారం వద్ద మరిన్ని మెరుగులతో ఏర్పాటు చేసింది. శనివారం శివాజీ గణేశన్‌ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఆ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించనున్నారు. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి(Former Chief Minister Karunanidhi) 2017లో మెరీనాబీచ్‌లోని గాంధీ విగ్రహ కూడలి వద్ద శివాజీ గణేశన్‌ విగ్రహాన్ని నెలకొల్పారు. ఆ విగ్రహం ట్రాఫిక్‌ కు అంతరాయంగా ఉందంటూ కొందరు హైకోర్టులో పిటిషన్‌ వేయడంతో ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించి అడయార్‌లోని ఆయన స్మారక మండపంలో గత అన్నాడీఎంకే ప్రభుత్వం ఏర్పాటు చేసింది.. ఆ విగ్రహం మండపం లోపల కంటే బయట ఉంటేనే బాగుంటుందని శివాజీ కుటుంబీకులు, ఆయన వీరాభిమానులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఆదేశాల ప్రకారం శివాజీ విగ్రహాన్ని స్మారక మండపం బయట పెట్టారు. ఈ విగ్రహాన్ని స్టాలిన్‌ శనివారం పునః ప్రారంభించనున్నారు.

Updated Date - 2022-10-01T15:30:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising