ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అది అసభ్యకరమైన జోక్‌.. సారీ!

ABN, First Publish Date - 2022-01-12T14:21:04+05:30

బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌కు నటుడు సిద్ధార్థ్‌ క్షమాపణలు చెప్పారు. ‘‘కొద్ది రోజుల కిందట మీరు చేసిన ట్వీట్‌కు స్పందనగా నేనో అసభ్యకరమైన జోక్‌ చేశాను. దానికి నేను క్షమాపణలు కోరుతున్నా. మీతో చాలా అంశాల్లో నేను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేను వాడిన భాష సరికాదు.. సైనాకు క్షమాపణలు చెప్పిన సిద్ధార్థ్‌

న్యూఢిల్లీ, జనవరి 11: బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌కు నటుడు సిద్ధార్థ్‌ క్షమాపణలు చెప్పారు. ‘‘కొద్ది రోజుల కిందట మీరు చేసిన ట్వీట్‌కు స్పందనగా నేనో అసభ్యకరమైన జోక్‌ చేశాను. దానికి నేను క్షమాపణలు కోరుతున్నా. మీతో చాలా అంశాల్లో నేను ఏకీభవించలేదు. అసంతృప్తి కూడా వ్యక్తం చేశాను. కానీ, మీ ట్వీట్‌ చూసిన తర్వాత ఆగ్రహంతో నేను స్పందించిన తీరు, వాడిన భాష సరికాదు. నేను జోక్‌ చేశాను తప్ప ఎలాంటి దురుద్దేశంతోనూ ఆ వ్యాఖ్యలు చేయలేదు. నేను మహిళలను గౌరవిస్తాను. నా ట్వీట్‌లో ఎలాంటి లింగ వివక్షా చూపలేదు. మహిళ కాబట్టి మీ మీద దాడి చేయాలన్న ఉద్దేశం ఎంత మాత్రం లేదు. ఇక ఇంతటితో మనం ఈ విషయాన్ని వదిలేద్దాం. మీరు నా లేఖను అంగీకరిస్తారని ఆశిస్తున్నా. మీరెప్పుడూ నా చాంపియనే. నిజాయితీతో మీ సిద్ధార్థ్‌’’ అని మంగళవారం రాత్రి ట్వీట్‌ చేశారు.  

Updated Date - 2022-01-12T14:21:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising