ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gujarat: బిల్కిస్ బానో‌ సంఘీభావ యాత్రకు చెక్ ...పలువురి అరెస్టు

ABN, First Publish Date - 2022-09-26T20:13:40+05:30

బిల్కిస్ బానో (Bilkis bano)కు సంఘీభావంగా ఆమె స్వగ్రామమైన రంథీకపూర్ నుంచి సోమవారం నిర్వహించాలనుకున్న..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గోద్రా: బిల్కిస్ బానో (Bilkis bano)కు సంఘీభావంగా ఆమె స్వగ్రామమైన రంథీకపూర్ నుంచి సోమవారం నిర్వహించాలనుకున్న పాదయాత్రను (Foot march) ముందుగానే గుజరాత్ పోలీసులు అడ్డుకున్నారు. రామన్ మెగసెసే అవార్డు గ్రహీత పాండేతో పాటు ముగ్గురు యాక్టివిస్ట్‌లను నిర్బంధంలోకి తీసుకున్నారు. 2002 గుజరాత్ అల్లర్ల అనంతర క్రమంలో బిల్కిస్ బానో సామూహిక అత్యాచారానికి గురికాగా, ఆమె కుటుంబ సభ్యులు ఏడుగురు దారుణంగా హత్యకు గురయ్యారు. ఈ కేసులో 11 మందికి యవజ్జీవ కారాగార శిక్ష పడగా, 15 ఏళ్లు శిక్షాకాలం పూర్తి చేసుకున్నారనే కారణంగా వారికి శిక్ష తగ్గించి గత ఆగస్టు 15న గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ చర్య తీవ్ర నిరసనలకు దారితీసింది. బిల్కీస్ బానోకు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్న హిందూ ముస్లిం ఏక్తా సమితి ఇందుకు నిరసనగా 'పాదయాత్ర'కు పిలుపునిచ్చింది.  షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 4వ తేదీన అహ్మదాబాద్‌లో ఈ పాదయాత్ర ముగియాల్సి ఉంది.


కాగా, పాండేతో సహా ముగ్గురు యాక్టివిస్టులను పాంచమహల్ జిల్లాలోని ఆదివారం నాడు నిర్బంధంలోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారు తమ నిర్బంధంలోనే ఉన్నట్టు బి-డివిజన్ పోలీస్ స్టేషన్ అధికారి ఒకరు తెలిపారు. కాగా, ఈ అరెస్టులను హిందు ముస్లిం ఏక్తా సమితి ఖండించింది.

Updated Date - 2022-09-26T20:13:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising