ప్రియుడి భార్య, బిడ్డపై యువతి యాసిడ్!
ABN, First Publish Date - 2022-12-07T04:13:00+05:30
ఆ పాతికేళ్ల యువతిది ఎంత దుర్మార్గమో కదా! తన ప్రియుడు తనను పట్టించుకోవడం లేదని, ఇందుకు కారణం అతడి భార్య, రెండున్నరేళ్ల చంటిబిడ్డేనని భావించి ఆ ఇద్దరిపై కసితో రగిలిపోయింది. పథకం ప్రకారం తనను ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు
వివాహేతర సంబంధం గొడవ కారణంగానే.. మహారాష్ట్రలోని నాగపూర్‌లో ఘటన
నాగపూర్, డిసెంబరు 6: ఆ పాతికేళ్ల యువతిది ఎంత దుర్మార్గమో కదా! తన ప్రియుడు తనను పట్టించుకోవడం లేదని, ఇందుకు కారణం అతడి భార్య, రెండున్నరేళ్ల చంటిబిడ్డేనని భావించి ఆ ఇద్దరిపై కసితో రగిలిపోయింది. పథకం ప్రకారం తనను ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు ఒంటినిండా బురఖా ధరించి...మాయమాటలు చెప్పి రప్పించుకొని మరీ తల్లీబిడ్డపై యాసిడ్ కుమ్మరించింది. మహారాష్ట్ర నాగపూర్ సమీపంలోని యశోదరాగనర్‌లో ఈ దారుణం జరిగింది. ‘వివాహేతర సంబంధం’ గురించి కొన్నాళ్లుగా నిందితురాలు, బాధితురాలు తరచూ గొడవ పడుతున్నారు. ఈ క్రమంలో నిందితురాలు తన స్నేహితురాలితో కలిసి కుట్రపన్నింది. ప్రియుడి భార్యకు మీ శ్రేయోభిలాషినంటూ ఫోన్ చేసింది. మీ భర్త నెరపుతున్న వివాహేతర సంబంధం గురించి చెబుతానని, అతడిని పట్టిస్తానని, తాను చెప్పిన చోటుకు రావాలని చెప్పింది. ఆమె మాటలను విశ్వసించిన వివాహిత.. చంటిబిడ్డను ఎత్తుకొని చెప్పిన చోటుకు వెళ్లింది. అక్కడికి బురఖాలో వచ్చిన నిందితురాలు వివాహితను మాటల్లో పెట్టి ఒక్కసారిగా వెంట తెచ్చుకున్న యాసిడ్‌ను తల్లీబిడ్డపై పోసింది. తీవ్రంగా గాయపడిన తల్లీబిడ్డను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. నిందితురాలిని పోలీసులు అదుపులో తీసుకున్నారు.
Updated Date - 2022-12-07T04:13:01+05:30 IST