ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Acharya Budati Venkateswarlu: మాలతీచందూర్‌ ఆలోచనలకు ఎల్లల్లేవ్‌

ABN, First Publish Date - 2022-08-14T14:44:34+05:30

విశ్వసాహిత్యాన్ని అవగాహన చేసుకున్న మాలతీచందూర్‌ ఆలోచనా ధోరణికి ఎల్లలు లేవని బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం తెలుగు శాఖాధ్యక్షుడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                                        - ఆచార్య బూదాటి వెంకటేశ్వర్లు


చెన్నై, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): విశ్వసాహిత్యాన్ని అవగాహన చేసుకున్న మాలతీచందూర్‌ ఆలోచనా ధోరణికి ఎల్లలు లేవని బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం తెలుగు శాఖాధ్యక్షుడు ఆచార్య బూదాటి వెంకటేశ్వర్లు(Acharya Budati Venkateswarlu) కొనియాడారు. మాలతీ చందూర్‌ విశ్వసాహిత్యాన్ని మధనం చేసి మనిషి జీవితంలోని విభిన్న కోణాలను, తీరుతెన్నులను, మానవ స్వభావాలను, ప్రకృతి వైపరీత్యాలు తదితర  విషయాలను తమ నవలల్లో తెలియజేశారన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు(Amarajeevi Potti Sriramulu) స్మారక సమితి నిర్వహించే ‘నెలా నెలా వెన్నెల’లో భాగంగా శనివారం సాయంత్రం నెట్టింట ‘విశ్వసాహిత్యం - మాలతీచందూర్‌ దృక్పథం’ అనే అంశంపై ఉపన్యాస కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి డీఆర్‌బీసీసీ హిందూ కళాశాల తెలుగు సహాయ ఆచార్యులు డా.తుమ్మపూడి కల్పన వ్యాఖ్యాతగా వ్యవహరించారు. మాలతీ చందూర్‌ నవల ‘శతాబ్ది సూరీడు’ మీద పరిశోధన గ్రంథ రచన పోటీల్లో ప్రథమ బహుమతి పాణ్యం దత్తకర్మకి లభించిందని న్యాయనిర్ణేతలు ఆచార్య కొలకలూరి ఆశాజ్యోతి, ఆంధ్రజ్యోతి ఢిల్లీ బ్యూరో చీఫ్‌ డా.కృష్ణారావు వెల్లడించారు. 

Updated Date - 2022-08-14T14:44:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising