ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Delhi Waqf board graft case: ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌కు 4 రోజుల పోలీస్ కస్టడీ

ABN, First Publish Date - 2022-09-18T00:53:41+05:30

ఢిల్లీ వక్ఫ్ బోర్డ్ అవినీతి కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌కు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఢిల్లీ వక్ఫ్ బోర్డ్ అవినీతి కేసు (Delhi Waqf Board corruption case)లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ (Amanatullah Khan)కు నాలుగు రోజుల పోలీస్ కస్టడీకి కోర్టు ఆదేశించింది. రౌస్ అవెన్యూలోని సీబీఐ ప్రత్యేక కోర్టు (Cbi special court) శనివారంనాడు ఈ ఆదేశాలిచ్చింది. ఢిల్లీ అవినీతి నిరోధక విభాగం (ACB) శుక్రవారంనాడు ఆయన నివాసంతో పాటు, ఆయన సహచరులు, వ్యాపార భాగస్వాముల నివాసాలపై దాడులు చేసింది. రోజంతా సోదాలు జరిపి అర్ధరాత్రి సమయంలో ఖాన్‌ను అరెస్టు చేసింది.


అమానతుల్లా ఖాన్ తమ దర్యాప్తునకు సహకరించనందున ఆయనను 14 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టును ఏసీబీ కోరింది. పట్టుబడిన సొమ్ము ఎక్కడిదో నిర్ధారించేందుకు ఆయనను తెలంగాణ, బిహార్, ఉత్తరాఖండ్, గుజరాత్ సహా దేశంలోని పలు ప్రాంతాలకు తీసుకు వెళ్లాల్సి ఉంటుందని కోర్టుకు ఏసీబీ తెలిపింది. ఢిల్లీ వక్స్‌బోర్డులో ఖాళీలు, అత్యవసర భర్తీ పేరుతో ఆయన తన మిత్రులు, బంధువులు, కావాల్సిన వారిని ఉద్యోగులుగా నియమించారని తెలిపింది. ఇందుకు సంబంధించిన ఒక డైరీని పబ్లిక్ ప్రాసిక్యూటర్ అతుల్ శ్రీవాత్సవ్ కోర్టుకు సమర్పించారు. రోజువారీ లావాదేవీలు అందులో ఉన్నట్టు శ్రీవాత్సవ చెప్పారు. కాగా, ప్రజాస్వామ్యబద్ధంగా మూడు సార్లు ఎన్నికైన సిట్టింగ్ ఎమ్మెల్యే ఎక్కడికీ పారిపోవడం లేదని, విచారణకు ఆయన ఎప్పుడూ సహకరిస్తూనే వచ్చారని, ఇకముందు కూడా సహకరిస్తారని, ఆయనకు బెయిల్ ఇవ్వాలని ఖాన్ తరఫు న్యాయవాది మెహ్రా కోర్టుకు విన్నవించారు.


ఏసీబీ రెయిడ్స్‌లో...

కాగా, జకియా నగర్, బాట్లా హౌస్, జామియా నగర్ సహా ఢిల్లీలో నాలుగు లొకేషన్లలో ఏసీబీ జరిపిన దాడుల్లో రూ.24 లక్షల నగదు, రెండు లైసెన్స్‌లు లేని ఆయుధాలు పట్టుబడ్డాయి. ఖాన్ సహచరుడు, వ్యాపార భాగస్వామి హమీద్ అలీని ఆయుధాల చట్టం కింద శనివారంనాడు అరెస్టు చేశారు. ఏసీబీ దాడుల తర్వాత మూడు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసినట్టు పోలీసులు చెప్పారు.

Updated Date - 2022-09-18T00:53:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising