ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంజాబ్ విజయంతో బెంగాల్‌పై ఆప్ ఫోకస్.. దీదీకి కొత్త ప్రత్యర్ధి

ABN, First Publish Date - 2022-03-14T21:31:17+05:30

కోల్‌కతా: పంజాబ్‌లో సంచలన విజయంతో ఆమ్ ఆద్మీ పార్టీ పశ్చిమబెంగాల్‌పై ఫోకస్ పెట్టింది. 2023లో జరిగే పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా: పంజాబ్‌లో సంచలన విజయంతో ఆమ్ ఆద్మీ పార్టీ పశ్చిమబెంగాల్‌పై ఫోకస్ పెట్టింది. 2023లో జరిగే పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించింది. పార్టీ హై కమాండ్ నిర్ణయం మేరకు పశ్చిమబెంగాల్‌లోని ఆప్ శాఖ ఇప్పటికే క్యాంపెయిన్ ప్రారంభించింది. నిన్న కోల్‌కతాలో ర్యాలీ నిర్వహించిందని పశ్చిమబెంగాల్ ఆప్ ఇంఛార్జ్ సంజయ్ బసు తెలియజేశారు. ప్రారంభంలో కమ్యూనిస్ట్‌లతో తలపడిన తృణమూల్ కాంగ్రెస్ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో ఢీకొంది. సంచలన విజయం సాధించింది. బీజేపీ ప్రతిపక్షానికే పరిమితమైంది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బెంగాల్‌లో పోటీ చేయాలని నిర్ణయించుకోవడంతో త్రిముఖ పోటీ తప్పదని పరిశీలకులు భావిస్తున్నారు. కొత్త ప్రత్యర్ధిని దీదీ ఎలా ఎదుర్కొంటారోనని ఆసక్తిగా గమనిస్తున్నారు. బీజేపీకి ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించాలనుకుంటోన్న దీదీకి ఇప్పుడు ఆప్ రూపంలో కొత్త ప్రత్యర్ధి ఎదురుకావడంతో ఆమె తన వ్యూహాలకు పదునుపెట్టక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది.     



Updated Date - 2022-03-14T21:31:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising