ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెబల్స్‌కు Adtiya Thackeray బహిరంగ సవాల్

ABN, First Publish Date - 2022-06-26T21:57:25+05:30

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న నేపథ్యంలో ఏకనాథ్ షిండే నాయకత్వంలోని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న నేపథ్యంలో ఏకనాథ్ షిండే నాయకత్వంలోని శివసేన తిరుగుబాటు నేతలకు మహారాష్ట్ర మంత్రి ఆదిత్య థాకరే బహిరంగ సవాలు విసిరారు. పార్టీని విడిచిపెట్టి ఎన్నికలకు రావాలని సవాలు విసిరారు. శివసేన కార్యకర్తలను ఉద్దేశించి ఆదిత్య థాకరే ఆదివారంనాడు మాట్లాడుతూ రెబల్స్‌కు సవాల్ చేశారు. ''మీకు దమ్ముంటే...శివసేన విడిచిపెట్టి పోరాడండి. మేము తప్పు చేశామనుకుంటే, ఉద్ధవ్ నాయకత్వం తప్పనుకుంటే, మీరు రాజీనామా చేయండి. ఎన్నికలను ఎదుర్కోండి. మేము సిద్ధంగా ఉన్నాం'' అని అన్నారు.


దీనికి ముందు మీడియాతో ఆదిత్య థాకరే మాట్లాడుతూ, నిజానికి, అబద్ధానికి మధ్య జరుగుతున్న యుద్ధం ఈ సంక్షోభం అని అన్నారు. శివసేన తిరుగుబాటు నేతల వంచనను తాము మరిచిపోలేమని, ఈ పోరాటంలో తాము (శివసేన) తప్పనిసరిగా గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. కాగా, ఎన్‌సీపీ, కాంగ్రెస్ పార్టీతో శివసేన చేతులు కలపడం అసహజమైన ప్రక్రియ అని, బాలాసాహెబ్ స్థాపించిన శివసేన పార్టీ తిరిగి బీజేపీతో పొత్తును పునరుద్ధరించాలని రెబల్ వర్గం వాదిస్తోంది.

Updated Date - 2022-06-26T21:57:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising