ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్మృతిపై స్పీకర్‌కు ఆధిర్‌ ఫిర్యాదు

ABN, First Publish Date - 2022-08-01T08:23:55+05:30

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై ఫిర్యాదు చేస్తూ కాంగ్రెస్‌ నాయకుడు ఆధిర్‌ రంజన్‌ చౌదరి ఆదివారం లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు లేఖ రాశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, జూలై 31: కేంద్ర  మంత్రి స్మృతి ఇరానీపై ఫిర్యాదు చేస్తూ కాంగ్రెస్‌ నాయకుడు ఆధిర్‌ రంజన్‌ చౌదరి ఆదివారం లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు లేఖ రాశారు. లోక్‌సభలో ఆమె రాష్ట్రపతి పేరును గౌరవప్రదంగా సంబోధించలేదని, ఇందుకు ఆమె బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండు చేశారు. తనకు హిందీ అంతగా రాకపోవడం వల్ల నోరు జారి రాష్ట్రపత్ని అని అన్నానని, ఇందుకు గౌరవ రాష్ట్రపతికి క్షమాపణలు చెప్పానని తెలిపారు. అయితే దీనిపై ఆమె సభలో లేనిపోని వివాదం సృష్టించారని చెప్పారు. ఆమె మాట్లాడుతూ ద్రౌపది ముర్ము అని పదేపదే అన్నారే తప్ప, గౌరవ రాష్ట్రపతి అనో, మేడమ్‌ అనో అనలేదని ఆరోపించారు. ఎలాంటి గౌరవ వాచకాలు చేర్చకుండా పదేపదే ద్రౌపది ముర్ము అని అంటూ పదవి గౌరవాన్ని తగ్గించారన్నారు. అందువల్ల ఆమె క్షమాపణ చెప్పాలని డిమాండు చేశారు. 

Updated Date - 2022-08-01T08:23:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising