ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Amnesty International India: మనీలాండరింగ్ కేసులో ఆకార్ పటేల్‌కు సమన్లు

ABN, First Publish Date - 2022-06-12T16:16:20+05:30

అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్-సీఈఓ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు : అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్-సీఈఓ ఆకార్‌ పటేల్‌, మరో ఇద్దరికి ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) ఫిర్యాదు మేరకు నమోదైన మనీలాండరింగ్ కేసులో ఈ చర్య తీసుకుంది. జూన్ 27న హాజరుకావాలని వీరిని ఆదేశించింది. 


ఇండియన్స్ ఫర్ అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అవినాశ్ కుమార్, ఏఐఐపీఎల్ మాజీ సీఈఓ జీ అనంత పద్మనాభన్, ఆకార్ పటేల్‌లకు ఈ కేసులో స్పెషల్ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ ఫిర్యాదును స్పెషల్ కేసుగా నమోదు చేయాలని ఆదేశించింది. సీబీఐ కేసుల ప్రత్యేక జడ్జి సంతోష్ గజానన్ భట్ ఈ చర్యలు తీసుకున్నారు.


అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా విదేశీ విరాళాల క్రమబద్ధీకరణ చట్టం (FCRA)ను ఉల్లంఘించినట్లు ఆరోపణలు నమోదయ్యాయి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుమతి పొందకుండా బ్రిటన్‌లోని సంస్థల నుంచి రూ.36 కోట్లు స్వీకరించిందని ఈడీ ఆరోపించింది. ఈ సంస్థ వ్యాపార పద్ధతులను ఉపయోగించి ఈ నిధిని సేకరించిందని పేర్కొంది. 


Updated Date - 2022-06-12T16:16:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising