ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Pakistani boat : గుజరాత్ తీరానికి పాకిస్థానీ పడవ... భారీగా మాదక ద్రవ్యాల స్వాధీనం...

ABN, First Publish Date - 2022-09-14T20:08:35+05:30

పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలను తీసుకొస్తున్న పాకిస్థానీ పడవను ఇండియన్ కోస్ట్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అహ్మదాబాద్ : పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలను తీసుకొస్తున్న పాకిస్థానీ పడవను ఇండియన్ కోస్ట్‌ గార్డ్, గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ బుధవారం స్వాధీనం చేసుకున్నాయి. భారతీయ జలాల్లో ఆరు మైళ్ళ లోపల ఈ పడవను స్వాధీనం చేసుకున్నాయి. దీనిలో రూ.200 కోట్ల విలువైన దాదాపు 40 కేజీల మాదక ద్రవ్యాలు ఉన్నాయి. 


ఇండియన్ కోస్ట్ గార్డ్ (Indian Coast Guard), గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (Gujarat Anti Terrorist Squad) వెల్లడించిన వివరాల ప్రకారం, గుజరాత్ తీరంలో జఖావూ నుంచి  33 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న పాకిస్థానీ పడవ అల్ తయ్యసను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్‌లో కోస్ట్ గార్డ్‌కు చెందిన రెండు ఫాస్ట్ అటాక్ బోట్లు పాల్గొన్నాయి. తదుపరి దర్యాప్తు కోసం ఈ పడవను, దీనిలోని ఆరుగురు సిబ్బందిని జఖావూ తీసుకెళ్లారు. 


కోస్ట్ గార్డ్, ఏటీఎస్ గతంలో కూడా మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకున్నాయి. 2021 అక్టోబరులో రూ.21,000 కోట్ల విలువైన 2,988 కేజీల హెరాయిన్‌ను గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో స్వాధీనం చేసుకున్నాయి. 


పాకిస్థాన్‌కు చెందిన రెండు మత్స్యకార పడవలను సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) గత నెలలో స్వాధీనం చేసుకుంది. గుజరాత్‌లోని కచ్ జిల్లాలో ఇండో-పాక్ సరిహద్దుల్లో ఈ ఆపరేషన్ జరిగింది. 


Updated Date - 2022-09-14T20:08:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising