ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాణిక్కం ఠాగూర్‌ను మార్చే అవకాశం?

ABN, First Publish Date - 2022-08-14T08:34:09+05:30

ఏఐసీసీ తెలంగాణ ఇన్‌ఛార్జిగా మాణిక్కం ఠాగూర్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఢిల్లీకి పుంఖాను పుంఖాలుగా రావడంతో పార్టీ అధిష్ఠానం తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సచిన్‌ పైలట్‌ లేదా మరో నేతకు తెలంగాణ బాధ్యతలు

న్యూఢిల్లీ,ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): ఏఐసీసీ తెలంగాణ ఇన్‌ఛార్జిగా మాణిక్కం ఠాగూర్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఢిల్లీకి పుంఖాను పుంఖాలుగా రావడంతో పార్టీ అధిష్ఠానం తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. పీసీసీ అధ్యక్షుడిని తప్ప పార్టీలో ఇతర నేతలెవర్నీ మాణిక్కం ఠాగూర్‌ పట్టించుకోకపోవడంతో తీవ్ర అసంతృప్తి చెలరేగుతోందని, అనేకమంది పార్టీని వీడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయని కొందరు సీనియర్‌ నేతలు ఢిల్లీకి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈసమయంలో మాణిక్కం ఠాగూర్‌ను మార్చి సీనియర్‌ కాంగ్రెస్‌ నేత సచిన్‌ పైలట్‌కు గానీ మరో నేతను గానీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జిగా నియమించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఒక ఎమ్మెల్యే, అధికార ప్రతినిధి మాణిక్కం ఠాగూర్‌ వైఖరి వల్ల పార్టీ మారాల్సివచ్చిందని, మరో ఎంపీ, ఎమ్మెల్యేతో పాటు అనేక మంది నేతలు కాంగ్రె్‌సను వీడే అవకాశాలున్నాయని సీనియర్లు చెబుతున్నట్టు తెలుస్తోంది. అనేకమంది నేతలు ఢిల్లీలో సీనియర్‌ నేతలకు ఫోన్లు చేస్తున్నారని, దీనితో ఠాగూర్‌ ఏమి చేస్తున్నారని ఢిల్లీ పెద్దలు ప్రశ్నించినట్లు తెలిసింది. కాగా ప్రియాంక రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జిగా నియమిస్తారన్న వదంతుల్లో నిజం లేదని పార్టీ వర్గాలు చెప్పాయి. 

Updated Date - 2022-08-14T08:34:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising