ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Yogi Adityanathపై సోషల్ మీడియాలో పోస్ట్... యువకుడి అరెస్ట్...

ABN, First Publish Date - 2022-06-14T23:05:40+05:30

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు వ్యతిరేకంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో ఓ పోస్ట్ పెట్టినందుకు ఆ రాష్ట్ర పోలీసులు పందొమ్మిదేళ్ళ యువకుడిని సోమవారం (జూన్ 13) అరెస్టు చేశారు. యోగికి వ్యతిరేకంగా ఓ అభ్యంతరకరమైన పోస్ట్‌ను వాట్సాప్ స్టేటస్‌లో ఆదివారం రాత్రి 11 గంటలకు పెట్టారని, అది వైరల్ అయిందని పోలీసులు తెలిపారు. 


ఉత్తర ప్రదేశ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఖజ్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని టెటారియా గ్రామానికి చెందిన పెయింటర్ అక్రమ్ అలీ వురపు గుల్‌బహార్‌ను అరెస్టు చేశారు. ఆయన ఆదివారం రాత్రి 11 గంటలకు తన వాట్సాప్ స్టేటస్‌లో యోగి ఆదిత్యనాథ్‌కు వ్యతిరేకంగా ఓ పోస్ట్ పెట్టారు. అది వైరల్ అయింది. దీంతో ఆయనపై స్వయంగా కేసును నమోదు చేశారు. ఉద్దేశపూర్వకంగా అవమానిస్తూ, శాంతిభద్రతలకు భంగం కలిగే విధంగా రెచ్చగొట్టే ఉద్దేశంతో వ్యవహరించినందుకు భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 504 ప్రకారం కేసు నమోదు చేశారు. అదేవిధంగా సెక్షన్ 505 (వివిధ వర్గాల ప్రజల మధ్య శత్రుత్వాన్ని, విద్వేషాన్ని, అయిష్టతను సృష్టించి ప్రోత్సహించడం),  సెక్షన్ 469 (పరువు, ప్రతిష్ఠలకు భంగం కలిగించేందుకు ఫోర్జరీ చేయడం), సెక్షన్ 295 (ఏదైనా మతాన్ని అవమానించే ఉద్దేశంతో ప్రార్థనా స్థలానికి హాని కలిగించడం, మలినపరచడం) ప్రకారం నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు నమోదు చేశారు. 


Updated Date - 2022-06-14T23:05:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising