ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

83 శాతం పెరిగిన ఆర్టీఐ అప్లికేషన్ల తిరస్కరణ

ABN, First Publish Date - 2022-03-05T21:45:34+05:30

‘జాతీయ భద్రతకు ముప్పు’ అనే కారణంతో కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఆర్టీఐ (సమాచార హక్కు) అప్లికేషన్ల తిరస్కరణ 83 శాతం పెరిగిందని తాజా నివేదిక చెబుతోంది. అయితే, మొత్తంగా చూస్తే అప్లికేషన్ల తిరస్కరణ 2.95 శాతం తగ్గినట్లు ఈ నివేదిక వెల్లడించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘జాతీయ భద్రతకు ముప్పు’ అనే కారణంతో కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఆర్టీఐ (సమాచార హక్కు) అప్లికేషన్ల తిరస్కరణ 83 శాతం పెరిగిందని తాజా నివేదిక చెబుతోంది. అయితే, మొత్తంగా చూస్తే అప్లికేషన్ల తిరస్కరణ 2.95 శాతం తగ్గినట్లు ఈ నివేదిక వెల్లడించింది. ఆర్టీఐ అప్లికేషన్ల తిరస్కరణపై మానవహక్కుల సంఘంలోని ఒక విభాగమైన కామన్‌వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనిషియేటివ్ (సీహెచ్‌ఆర్ఐ)కు చెందిన వెంకటేష్ నాయక్ ఒక నివేదిక రూపొందించారు. ప్రతి సంవత్సరం కేంద్రంలోని అన్ని శాఖలు, విభాగాలు.. తమకు అందిన ఆర్టీఐ అప్లికేషన్ల వివరాల్ని సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్‌కు అందించాలి. ఈ కమిషన్‌కు అందిన 2,182 విభాగాలు, శాఖలకు సంబంధించిన వివరాల ఆధారంగా తాజా నివేదిక రూపొందింది.


ఈ నివేదిక ప్రకారం.. 2019-20లో కేంద్ర శాఖలకు మొత్తం 1.29 లక్షల ఆర్టీఐ అప్లికేషన్లు వచ్చాయి. దేశవ్యాప్తంగా వివిధ శాఖలకు కలిపి 13.3 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. వీటిలో 53,537 అప్లికేషన్లు తిరస్కరణకు గురికాగా, వాటిలో 1,024 అప్లికేషన్లను ’జాతీయ భద్రతకు ముప్పు‘ అనే కారణంతో తిరస్కరించారు. అంతకుముందు ఏడాది ఈ కారణంతో 557 అప్లికేషన్లు మాత్రమే తిరస్కరణకు గురయ్యాయి. మొత్తంగా చూస్తే అప్లికేషన్ల తిరస్కరణ రేటు తగ్గిందని నాయక్ నివేదిక తేల్చింది. ఆర్టీఐ యాక్ట్ సెక్షన్ 8 (1) ఏ ప్రకారం జాతీయ భద్రతకు ముప్పుగా భావించే అంశాల్ని ఆర్టీఐ ప్రకారం వెల్లడించే అవకాశం లేదు. ఎక్కువ ఆర్టీఐ అప్లికేషన్లు హెల్త్ అండ్ స్టీల్ రంగానికి సంబంధించే వచ్చాయి.

Updated Date - 2022-03-05T21:45:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising