ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

UPలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి.. 25 మందికి పైగా గాయాలు..

ABN, First Publish Date - 2022-09-28T16:12:31+05:30

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖీంపూర్‌ఖేరీ (Lakhimpur Kheri) దగ్గర ప్రైవేటు బస్సును ట్రక్కు ఢీకొట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లఖింపూర్ ఖేరీ (ఉత్తరప్రదేశ్) : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖీంపూర్‌ఖేరీ (Lakhimpur Kheri) దగ్గర ప్రైవేటు బస్సును ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 8 మంది అక్కడికక్కడే మృతి చెందగా.. 25 మందికి పైగా గాయాలయ్యాయి. బస్సు ధౌరేహ్రా నుంచి లక్నో (Dhaurehra to Lucknow) వెళుతుండగా ఇసానగర్ పోలీస్ స్టేషన్ (Isanagar Police station) పరిధిలో ఎరా వంతెన సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారందరినీ జిల్లా ఆసుపత్రికి తరలించగా, మరికొందరిని మెరుగైన చికిత్స నిమిత్తం లక్నో (Lucknow)కు రిఫర్ చేసినట్లు లఖింపూర్ ఖేరీ అదనపు జిల్లా మేజిస్ట్రేట్ (ADM) సంజయ్ కుమార్ తెలిపారు.


సమాచారం అందుకున్న ఏడీఎం, సర్కిల్‌ అధికారి(CO) జిల్లా ఆస్పత్రికి చేరుకున్నారు. ప్రమాదంపై రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (CM Yogi Adityanath) సంతాపం తెలిపారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులకు సరైన చికిత్స అందేలా చూడాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. "లఖింపూర్ ఖేరీ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జరిగిన ప్రాణ నష్టానికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మహారాజ్ సంతాపం తెలిపారు. వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టి, గాయపడిన వారికి చికిత్స కోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలని యోగి సీనియర్ అధికారులను ఆదేశించారు” అని సీఎంఓ (CMO) ట్వీట్ చేసింది. మృతుల కుటుంబ సభ్యులకు యోగి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని యోగి ఆకాంక్షించారు.

Updated Date - 2022-09-28T16:12:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising