ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పురుష సంతానలేమి వెనుక 8 జన్యువులు

ABN, First Publish Date - 2022-09-08T08:07:14+05:30

ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడు జంటల్లో ఒక జంట సంతానలేమితో బాధపడుతున్నారని ఒక అంచనా.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుర్తించిన సీసీఎంబీ పరిశోధకులు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 7: ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడు జంటల్లో ఒక జంట సంతానలేమితో బాధపడుతున్నారని ఒక అంచనా. వీటిలో పురుష వంధ్యత్వం 50ు కేసుల్లో కారణం. పురుష పునరుత్పత్తి వ్యవస్థ సమస్యలు, వీర్యనాణ్యత లేకపోవడం, దీర్ఘకాలిక అనారోగ్యం, జన్యుపరమైన కారణాలు, అనారోగ్యకర జీవనశైలి వంటి అనేక కారణాలు దీని వెనుక ఉన్నాయి. వీటితో పాటు 8 రకాల జన్యువుల వలన పురుషుల్లో సంతానలేమి తలెత్తుతోందని హైదరాబాద్‌లోని సెల్యులర్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ(సీసీఎంబీ)కి చెందిన డాక్టర్‌ కె.తంగరాజ్‌ గ్రూపు తాజాగా స్పష్టం చేసింది.


ఈ అధ్యయన వివరాలను హ్యూమన్‌ మాలికులర్‌ జెనెటిక్స్‌ అనే జర్నల్‌లో ప్రచురించారు. దీనికి సంబంధించిన వివరాలను సీసీఎంబీ పీహెచ్‌డీ విద్యార్థి డాక్టర్‌ సుధాకర్‌ దిగుమర్తి వెల్లడించారు. ‘‘సంతానలేమి సమస్యలు ఉన్న పురుషుల్లో సుమారు 30వేల జన్యువుల్లోని కీలక ప్రాంతాలకు సీక్వెన్సింగ్‌ నిర్వహించాం. దేశవ్యాప్తంగా 1500 మందిని దీనికోసం ఎంచుకున్నాం’’ అన్నారు. ఇక తాము గుర్తించిన జన్యువులకు పురుష వంధ్యత్వానికి సంబంధం ఉన్నట్లు ఇంతకుముందు తెలియదని పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్‌ తంగరాజ్‌ తెలిపారు. ‘‘మొత్తం 8రకాల జన్యువులను గుర్తించాం. అవి బీఆర్‌డీటీ, సీఈటీఎన్‌1, సీఏటీఎ్‌సపీఈఆర్‌డీ, జీఎంసీఎల్‌1, ఎస్‌పీఏటీఏ6, టీఎ్‌సఎ్‌సకే4, టీఎ్‌సకేఎస్‌, జెడ్‌ఎన్‌ఎ్‌ఫ318. ఈ జన్యువుల్లో ఉత్పరివర్తన కారణంగా వీర్య ఉత్పత్తిలో సమస్యలు తలెత్తి, సంతానలేమితో బాధపడుతున్నారు’’ అని తంగరాజ్‌ వివరించారు. హైదరాబాద్‌కు చెందిన మమత ఫెర్టిలిటీ ఆస్పత్రి, డీబీటీ-సెంటర్‌ ఫర్‌ డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింటింగ్‌ అండ్‌ డయాగ్నస్టిక్స్‌ సహా దేశవ్యాప్తంగా అనేక సంస్థలు ఈ అధ్యయనంలో పాలుపంచుకున్నాయని పరిశోధకులు తెలిపారు.

Updated Date - 2022-09-08T08:07:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising