ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

MP వ్యాపారవేత్త ఇంట్లో రైడ్: రూ.8 కోట్లు సీజ్

ABN, First Publish Date - 2022-01-09T15:26:42+05:30

శంకర్ రాయ్ గతంలో దామోహ్ నగర పాలిక సంస్థ చైర్మన్‌గా పని చేశారు. ఈయన కాంగ్రెస్ మద్దతుదారుడు. ఇక ఆయన తమ్ముడు కమల్ రాయ్ కూడా బీజేపీ మద్దతుతో దమోహ్ నగర పాలిక సంస్థ వైస్ చైర్మన్‌గా పని చేశారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భోపాల్: మధ్యప్రదేశ్‌లోని దామోహ్ జిల్లాకు చెందిన శంకర్ రాయ్ అనే వ్యాపారవేత్త ఇంట్లో లెక్కల్లో లేని కోట్ల రూపాయల సొత్తును ఆదాయపు పన్ను శాఖ అధికారులు సీజ్ చేశారు. మంగళవారం ఉదయం 5 గంటల సమయంలో శంకర్ ఇంట్లో రైడ్ నిర్వహించారు. సుమారు 39 గంటల పాటు కొనసాగిన ఈ రైడ్‌లో మొత్తం 8 కోట్ల రూపాయల డబ్బు లభించినట్లు అధికారులు తెలిపారు. కాగా, ఇందులో కొటి రూపాయ నగదును ఓ బ్యాగ్‌లో సర్ది, ఆ బ్యాగ్‌ను వాటర్ ట్యాంక్‌లో దాచారు. వీటితో పాటు మూడు కిలోగ్రాముల బంగారాన్ని కూడా సీజ్ చేసినట్లు ఆదాయపు పన్ను శాఖ అధికారులు తెలిపారు.


శంకర్ రాయ్ గతంలో దామోహ్ నగర పాలిక సంస్థ చైర్మన్‌గా పని చేశారు. ఈయన కాంగ్రెస్ మద్దతుదారుడు. ఇక ఆయన తమ్ముడు కమల్ రాయ్ కూడా బీజేపీ మద్దతుతో దమోహ్ నగర పాలిక సంస్థ వైస్ చైర్మన్‌గా పని చేశారు. తమ వద్ద పని చేస్తున్న ఉద్యోగుల పేర్లుతో డజనుకు పైగా వ్యాపారాలను వీళ్లు నిర్వహిస్తున్నారు. కాగా, శంకర్‌ రాయ్‌ వ్యాపారాలకు సంబంధించిన సమాచారం అందిస్తే 10,000 రూపాయల రివార్డ్ అందిస్తామని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతానికి భౌతిక రైడ్‌లు ముగిసాయని తదుపని విచారణ ప్రారంభమైందని ఆదాయపు పన్ను శాఖ అధికారులు తెలిపారు.

Updated Date - 2022-01-09T15:26:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising