ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓటరు సవరణలకు 60 వేల మంది ఉపాధ్యాయులు

ABN, First Publish Date - 2022-12-06T11:17:19+05:30

రాష్ట్ర వ్యాప్తంగా ఓటరు జాబితా(Voter list) సవరణ ప్రక్రియ కోసం ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు చెందిన 60వేల మంది ఉ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- విద్యాభివృద్ధికి ఆటంకమంటున్న నిపుణులు

బెంగళూరు, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా ఓటరు జాబితా(Voter list) సవరణ ప్రక్రియ కోసం ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు చెందిన 60వేల మంది ఉపాధ్యాయులను నియమించడంపై విద్యానిపుణులు అభ్యంత రం వ్యక్తం చేస్తున్నారు. మరో నాలుగు నెలలో శాసనసభ ఎన్నికలు రానున్నందున ఓటరు జాబితాలో చేర్పులు, మార్పుల ప్రకియ సాగుతోంది. రాష్ట్రమంతా ఉపాధ్యాయులను ఎన్నికల విధులకు నియమించారు. రాష్ట్ర వ్యాప్తం గా 45 వేల ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలో 30 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి బోధనలు సా గించేందుకు 1.56 లక్షల మంది ఉపాధ్యాయులు ఉన్నారు. వీరిలో 60వేల మందిని ఓటరు జాబితా సవరణల విధులకు కేటాయించారు. ఒక్కసారిగా ఇంతస్థాయిలో ఉపాధ్యాయులను విధులకు కేటాయించడం ద్వారా విద్యావ్యవస్థకు ఇబ్బందికర పరిస్థితి నెలకొంటుందని నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇతర శాఖల ఉద్యోగులను కాకుండా పెద్దసంఖ్యలో ఉపాధ్యాయులను నియమించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. మరో మూడు నెలల్లోనే విద్యాసంవత్సరం ముగింపు పరీక్షలు రానున్నాయి. గడిచిన రెండేళ్లు కొవిడ్‌ కారణంగా తరగతులు జరగనేలేదు. ఈ సంవత్సరం సజావుగా తరగతులు కొనసాగుతుండగా ఓటరు జాబితా సవరణలకంటూ వేలాది మందిని నియమించడం సమంజసం కాదని, విధుల నుంచి తప్పించాలని కోరుతున్నారు. వేసవి సెలవుల కాలమైతే ఇబ్బంది ఉండదు కానీ పాఠ్యాంశాలు కొనసాగాల్చిన వేళ అంతరాయం కలిగించడం తగదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - 2022-12-06T11:17:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising