ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హిజాబ్ వివాదం.. ఉడుపి కాలేజీ నుంచి ఇంటికి చేరుకున్న 60 మంది ముస్లిం విద్యార్థినులు

ABN, First Publish Date - 2022-02-17T22:02:37+05:30

హిజాబ్‌ను తొలగిస్తే తప్ప కాలేజీలోకి అనుమతించబోమని చెప్పడంతో ఉడుపిలోని ప్రభుత్వం జి.శంకర్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంగళూరు: హిజాబ్‌ను తొలగిస్తే తప్ప కాలేజీలోకి అనుమతించబోమని చెప్పడంతో ఉడుపిలోని ప్రభుత్వం జి.శంకర్ మెమోరియల్ మహిళా ఫస్ట్ గ్రేడ్ డిగ్రీ కళాశాలకు చెందిన 60 మంది ఫైనల్ ఇయర్  విద్యార్థినులు తిరిగి ఇళ్లకు చేరుకున్నారు. డిగ్రీ కళాశాలలో యూనిఫామ్ తప్పనిసరి కాదని ముఖ్యమంత్రి చెప్పారని ముస్లిం విద్యార్థినులు కాలేజీ అధికారులతో వాదించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.


కాలేజీ అభివృద్ధి కమిటీ కొన్ని నిబంధనలు విధించిందని, దాని ప్రకారం హిజాబ్‌ను అనుమతించబోమని కాలేజీ యాజమాన్యం తేల్చి చెప్పింది. తలను కప్పుకోకుండా తాము తరగతులకు హాజరు కాబోమని హిజాబ్, విద్య రెండూ తమకు సమానమేనని పేర్కొన్న విద్యార్థినులు.. డిగ్రీ కాలేజీలలో ప్రభుత్వం డ్రెస్ కోడ్ అమలు చేయాలని నిర్ణయిస్తే కనుక ఆ విషయాన్ని లిఖితపూర్వకంగా ఇవ్వాలని డిమాండ్ చేశాడు. 


కాలేజీలు ప్రారంభమైన రెండో రోజు కూడా అంతా ప్రశాంతంగానే ఉందని ఉడుపి అదనపు సూపరింటెండెంట్ సిద్దలింగప్ప మీడియాకు తెలిపారు. హిజాబ్‌ను తొలగిస్తామని హామీ ఇచ్చే ముస్లిం అమ్మాయిలను మాత్రమే ప్రభుత్వ జి.శంకర్ కాలేజీలోకి అనుమతిస్తున్నట్టు చెప్పారు.  

Updated Date - 2022-02-17T22:02:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising