ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

60 లక్షల టన్నుల బొగ్గు గాయబ్: రాహుల్ గాంధీ

ABN, First Publish Date - 2022-02-23T22:21:51+05:30

గుజరాత్‌ ముఖ్యమంత్రిగా నరేంద్రమోదీ ఉన్నప్పుడు పారిశ్రామిక, మైన్స్, మినరల్స్ అభివృద్ధి శాఖ ఆయన వద్దే ఉండేది. అనంతరం వచ్చిన ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఈ శాఖను నిర్వహించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సైతం ఈ శాఖను..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: గుజరాత్‌లో 60 లక్షల బొగ్గు కుంభకోణం జరిగిందని కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఈ విషయమై ఒక హిందీ పత్రికలో వచ్చిన వార్తను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ ‘‘ఈ కుంభకోణంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడతారా?’’ అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ కుంభకోణం జరిగిందని ఆరోపిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. దీనిపై నిర్దేశిత వ్యవధిలో దర్యాప్తు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తోంది.


గుజరాత్‌ ముఖ్యమంత్రిగా నరేంద్రమోదీ ఉన్నప్పుడు పారిశ్రామిక, మైన్స్, మినరల్స్ అభివృద్ధి శాఖ ఆయన వద్దే ఉండేది. అనంతరం వచ్చిన ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఈ శాఖను నిర్వహించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సైతం ఈ శాఖను తన పరిధిలోనే పెట్టుకున్నారు. అయితే ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ కొద్ది రోజులుగా బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. గుజరాత్ మోడల్ అంటే కుంభకోణాలమయమని విమర్శలు గుప్పిస్తున్నారు.


ఈ విషయమై గుజరాత్ కాంగ్రెస్‌కు చెందిన ఒక నేత మాట్లాడుతూ ‘‘గడిచిన 14 ఏళ్లలో 6,000 కోట్ల రూపాయల విలువైన 60 లక్షల టన్నుల బొగ్గును దారి మళ్లించారు. వాస్తవానికి ఈ బొగ్గును టన్నుకు 3,000 రూపాయల చొప్పున 1,800 కోట్ల రూపాలయకు పరిశ్రమలకు విక్రయించాలి. కానీ నిబంధనలకు విరుద్ధంగా టన్నుకు 8,000 నుంచి 10,000 రూపాయల చొప్పున ఇతర రాష్ట్రాలకు విక్రయించారు’’ అని అన్నారు.

Updated Date - 2022-02-23T22:21:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising