ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అన్నా యూనివర్సిటీలో ఆరుగురు విద్యార్థులకు Covid

ABN, First Publish Date - 2022-05-24T22:12:57+05:30

చెన్నై : తమిళనాడులోని పలు విశ్వవిద్యాలయాలు కొవిడ్ వ్యాప్తి కేంద్రాలుగా మారుతున్నాయి. నెలక్రితం ఐఐటీ మద్రాస్‌లో 180కిపైగా కరోనా కేసులు నమోదవ్వగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై : తమిళనాడులోని పలు విశ్వవిద్యాలయాలు కొవిడ్ వ్యాప్తి కేంద్రాలుగా మారుతున్నాయి. నెలక్రితం ఐఐటీ మద్రాస్‌(IIt madras)లో 180కిపైగా కరోనా కేసులు నమోదవ్వగా.. తాజాగా గుండిలోని అన్నా యూనివర్సిటీ(Anna University) క్యాంపస్‌లో ఆరుగురు విద్యార్థులకు కరోనా(Corona) నిర్ధారణ అయ్యింది. అన్నా యూనివర్సిటీలో ఇటివల జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న ఓ మహిళలో కొన్ని కొవిడ్ లక్షణాలు కనిపించాయి. నమూనా సేకరించి పరీక్షించగా కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారిలో ఎవరికైనా కొవిడ్ లక్షణాలు కనిపిస్తే వెంటనే నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలని తమిళనాడు స్టేట్ హెల్త్ సెక్రటరీ జే.రాధాక్రిష్ణన్‌ కోరారు. కొవిడ్ కేసుల సమాచారాన్ని తెలుసుకున్న ఆయన ఇతర వైద్యాధికారులతో కలిసి క్యాంపస్‌ను సందర్శించారు. అక్కడి పరిస్థితిని సమీక్షించి.. వైరస్ వ్యాప్తి నిరోధానికి చర్యలు తీసుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 40 మంది నమూనాలు పరీక్షించగా.. ఆరుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని అధికారులు వివరించారు. చెన్నైలోని అడయార్, తెన్యంపేట్, పెరుంగుడి ప్రాంతాల చుట్టుపక్కల ఇంకా కొవిడ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయని అధికారులు హెచ్చరించారు. కాగా నెలక్రితం ఐఐటీ మద్రాస్‌లో 180కిపైగా మంది విద్యార్థులు, సిబ్బందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే.

Updated Date - 2022-05-24T22:12:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising