ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

58 ఏళ్ల అనంతరం బయల్పడిన నేల వంతెన

ABN, First Publish Date - 2022-05-24T17:03:01+05:30

ధనుష్కోటిలో అలల తాకిడికి 58 ఏళ్ల క్రితం పూడుకుపోయిన నేల వంతెన బయల్పడింది. రామేశ్వరం నుంచి సుమారు 25 కి.మీ దూరంలో ఉన్న ధనుష్కోతి ప్రాంతం,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెరంబూర్‌(చెన్నై): ధనుష్కోటిలో అలల తాకిడికి 58 ఏళ్ల క్రితం పూడుకుపోయిన నేల వంతెన బయల్పడింది. రామేశ్వరం నుంచి సుమారు 25 కి.మీ దూరంలో ఉన్న ధనుష్కోతి ప్రాంతం, 1964వ సంవత్సరానికి ముందు వరకు రామేశ్వరం కన్నా పెద్ద వాణిజ్య నగరంగా ప్రసిద్ధిచెందింది. అలాగే, ధనుష్కోటి నుంచి శ్రీలంకకు నౌక సవారీ, ధనుష్కోటి వరకు రైలుమార్గం ఉండేది. పాఠశాలలు, తపాలా కార్యాలయం, ఆస్పత్రి, ఆలయాలు, హార్బర్‌ తదితర వసతులతో ప్రధాన వాణిజ్య, పర్యాటక కేంద్రంగా కొనసాగేది. 1964 డిసెంబరు 23న సంభవించిన భారీ తుఫాను కారణంగా ధనుష్కోటి నగరం పూర్తిగా ధ్వంసమైంది. తుఫాను తర్వాత ఆ ప్రాంతానికి పర్యాటకులు వెళ్లకుండా ప్రభుత్వం నిషేధం విధించగా, కొందరు జాలర్లు మాత్రం అక్కడే గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారు. ఈ క్రమంలో, వారం రోజులుగా ఈ ప్రాంతంలో ఈదురుగాలులతో భారీగా అలలు ఎగిసిపడుతుండడంతో పలు ప్రాంతాల్లో సముద్రపుతీరం కోతకు గురైంది. దీంతో, 1964లో తుఫాను కారణంగా సముద్రంలో మునిగిన నేల వంతెన బయల్పడింది. కాంక్రీట్‌ దిమ్మెల మీద నేత వంతెన నిర్మించారు.  

Updated Date - 2022-05-24T17:03:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising