ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

50% మొత్తం డిపాజిటివ్‌ అవసరం లేదు

ABN, First Publish Date - 2022-02-16T06:35:50+05:30

వినియోగదారుల చట్టం కేసులకు సంబంధించి సుప్రీం కోర్టు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • 2019కి పూర్వం కేసుల అప్పీలుకు..
  •  వినియోగదారుల చట్టం కేసుల్లో సుప్రీం కోర్టు తీర్పు


న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: వినియోగదారుల చట్టం కేసులకు సంబంధించి సుప్రీం కోర్టు మంగళవారం ముఖ్యమైన తీర్పును వెలువరించింది. పరిహారం చెల్లింపుపై ఎవరైనా వినియోగదారుకు అనుకూలంగా తీర్పు వచ్చిన కేసులపై.. సంబంధిత సంస్థ పై కోర్టుకు అప్పీలుకు వెళ్లే సందర్భంలో పరిహారం మొత్తంలో 50% డిపాజిట్‌ చేయాలన్న నిబంధనపై స్పష్టతనిచ్చింది. ఈ కేసులు 2019కి పూర్వం దాఖలు చేసినవి అయితే 50% మొత్తా న్ని డిపాజిట్‌ చేయాలన్న నిబంధన వర్తించదని స్పష్టం చేసింది.


వినియోగదారుల చట్టం-1986 ప్రకారం పరిహారం కోసం ఎవరైనా ఫోరంలో ఫిర్యాదు చేస్తే ఆ మొత్తంలో 50% కానీ, లేదా 50 వేలు కానీ.. రెండింటిలో ఏది తక్కువైతే అది డిపాజిట్‌ చేయాలి. 2019లో సవరించిన చట్టం ప్రకారం.. ఫిర్యాదుదారుకు అందజేయాలన్న పరిహారం మొత్తంలో 50ు డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. అయితే, ఓ కేసులో 10% వడ్డీతో కలిపి రూ.265 కోట్లు పరిహారం చెల్లించాలంటూ జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ ఇచ్చిన తీర్పుపై ఎక్స్‌పోర్ట్‌ క్రెడిట్‌ గ్యారంటీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఈసీజీసీ).. దేశ సర్వోన్నత నాయ్యస్థానాన్ని ఆశ్రయించింది. ఇది 2019కి ముందునాటి కేసు కావడంతో డిపాజిటి మొత్తం విషయమై అప్పటి నిబంధనలే వర్తిస్తాయని జస్టిస్‌ హేమంత్‌ గుప్తా, జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పుచెప్పింది.


Updated Date - 2022-02-16T06:35:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising