తెలుగు రాష్ట్రాలకు 5 యూనిట్లు
ABN, First Publish Date - 2022-10-17T08:55:40+05:30
ప్రధాని ప్రారంభించిన 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లలో మూడు తెలంగాణలో, రెండు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి.
జనగామలో పర్యవేక్షించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
జనగామ, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): ప్రధాని ప్రారంభించిన 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లలో మూడు తెలంగాణలో, రెండు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. ఏపీలోని తూర్పుగోదావరి, మచిలీపట్నంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఈ యూనిట్లు అందుబాటులోకి రాగా.. తెలంగాణలోని జనగామ, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఖమ్మంలోని సిటీ యూనియన్ బ్యాంక్‌లో ఖాతాదారులకు డీబీయూ సేవలు లభించనున్నాయి. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదివారం జనగామకు వచ్చారు. గతంలో ప్రభుత్వం నుంచే వచ్చే డబ్బుల్లో 85 శాతం దళారుల మెక్కగా 15 శాతం మాత్రమే పేదలకు అందేవని, డిజిటల్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ (డీబీటీ) ద్వారా ప్రస్తుతం నేరుగా పేదల ఖాతాల్లోనే జమ అవుతున్నాయని అన్నారు. విద్యార్థుల స్కాలర్‌షి్‌పలను నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేయాలని నిర్ణయించామని చెప్పారు. దేశవ్యాప్తంగా గతంలో 4 కోట్ల పై చిలుకు అక్రమ రేషన్ కార్డులు, గ్యాస్ కనెక్షన్లు ఉండేవని.. డిజిటలైజేషన్‌తో వాటన్నింటినీ రద్దు చేశామని అన్నారు. విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం ‘వన్ క్లాస్ వన్ టీవీ’ కార్యక్రమాన్ని తీసుకురాబోతోందని తెలిపారు.
Updated Date - 2022-10-17T08:55:40+05:30 IST