Kiren Rijiju : దేశంలో 5 కోట్ల పెండింగ్ కేసులు
ABN, First Publish Date - 2022-12-07T04:39:54+05:30
దేశంలోని అన్ని కోర్టుల్లో పెండింగ్ కేసులు పెరిగిపోతుండడంపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం ఢిల్లీ హైకోర్టులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన
కింది కోర్టుల్లో పరిస్థితి దారుణం.. వసతుల లేమి
న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు
సీజేఐ డీవై చంద్రచూడ్ సమక్షంలోనే వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, డిసెంబరు 6: దేశంలోని అన్ని కోర్టుల్లో పెండింగ్ కేసులు పెరిగిపోతుండడంపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం ఢిల్లీ హైకోర్టులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ రానున్న రెండు నెలల వ్యవఽధిలో పెండింగ్ కేసులు 5 కోట్లకు చేరుకునే అవకాశం ఉందని తెలిపారు. ఇంతవరకు 4.83 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. కార్యక్రమంలో పాల్గొన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ సమక్షంలోనే ఈ వ్యాఖ్య చేయడం గమనార్హం. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో కేసులు పరిష్కారమయ్యే అవకాశం ఉన్నా, కింది కోర్టుల్లో పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు. కింది కోర్టుల్లో మౌలిక వసతులు లేకపోవడం ప్రధాన కారణంగా కనిపిస్తోందని చెప్పారు. సత్వర న్యాయం అందించడంలో ఎదురవుతున్న ఇబ్బందులపై విశ్లేషించాల్సి ఉందని తెలిపారు. పెండింగ్ కేసులపై పార్లమెంటులోనూ, ఇతర చోట్లా జవాబు చెప్పాల్సింది తానేనని అన్నారు. సమాధానం ఇవ్వడం కష్టమవుతోందని చెప్పారు. భవిష్యత్తులో కాగిత రహిత డిజిటల్ జ్యుడీషియరీ ఏర్పాటు కానుందని, అప్పుడు కాలహరణ చాలా వరకు తగ్గుతుందని అభిప్రాయపడ్డారు.
Updated Date - 2022-12-07T04:39:55+05:30 IST