ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

42 వేల టీకాల మందు వృథా

ABN, First Publish Date - 2022-04-16T17:38:41+05:30

రాష్ట్రంలో 12-14 సంవత్సరాల లోపు పిల్లలు ఆసక్తి చూపకపోవడంతో కోర్బోవ్యాక్స్‌ టీకా మందు 4.47 శాతం వృథా అ యిందని, ఈ మందుతో 42 వేల మందికి టీకాలు వేసే అవకాశం ఉండేదని ఆ రోగ్య

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                    - ఆసక్తి చూపని పిల్లలు 

                    - రూ.8.40 కోట్ల నష్టం


బెంగళూరు: రాష్ట్రంలో 12-14 సంవత్సరాల లోపు పిల్లలు ఆసక్తి చూపకపోవడంతో కోర్బోవ్యాక్స్‌ టీకా మందు 4.47 శాతం వృథా అయిందని, ఈ మందుతో 42 వేల మందికి టీకాలు వేసే అవకాశం ఉండేదని ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ కే సుధాకర్‌ ప్రకటించారు. నగరంలో శుక్రవారం ఆయన మీడియాకు ఈ సమాచారం అందించారు. రాష్ట్రవ్యాప్తంగా మార్చి 16 నుంచి ఏ ప్రిల్‌ 8 వరకు ఈ వృథా జరిగిందన్నారు. కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ టీకాల మందుసీసా ఒకసారి తెరిస్తే పది మందికి ఇచ్చే వీలుందని అయితే పిల్లల కోసం ఉద్దేశించిన కోర్బోవ్యాక్స్‌ టీకా మందు సీసా తెరిస్తే 20 మందికి ఇవ్వాల్సి ఉంటుందని, ఈ కారణంగానే ఒకసారి తెరచిన సీసాను నాలుగు గంటలలోపు వినియోగించకపోతే వృథా అవుతుంతోందన్నారు. ప్రస్తుతం విద్యాసంస్థలకు వేసవి సెలవులు ఉండటం, గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలు టీకాలు వేయించుకునేందుకు పెద్దగా ఆసక్తిచూపకపోవడం ఇందుకు ప్రధాన కారణమని మంత్రి వివరించారు. 42 వేల డోసుల టీకా విలువ రూ.8.40 కోట్లుగా అంచనా వేశామన్నారు.

Updated Date - 2022-04-16T17:38:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising