ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుజరాత్‌ ఎమ్మెల్యేల్లో.. 40 మందిపై కేసులు

ABN, First Publish Date - 2022-12-12T05:21:59+05:30

ఇటీవల గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన 182 మంది ఎమ్మెల్యేల్లో 40 మందిపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. వారిలో 29 మందిపై హత్య, అత్యాచారం లాంటి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అహ్మదాబాద్‌, డిసెంబరు 11: ఇటీవల గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన 182 మంది ఎమ్మెల్యేల్లో 40 మందిపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. వారిలో 29 మందిపై హత్య, అత్యాచారం లాంటి తీవ్రమైన కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. తీవ్ర నేరాభియోగాలు ఉన్న వారిలో అత్యధికంగా బీజేపీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు ఉండగా, నలుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఇద్దరు ఆప్‌ ఎమ్మెల్యేలు, ఓ సమాజ్‌వాదీ ఎమ్మెల్యే ఉన్నారు. ఎమ్మెల్యేల ఎన్నికల అఫిడవిట్‌లను అధ్యయనం చేసిన ఏడీఆర్‌, గుజరాత్‌ ఎలక్షన్‌ వాచ్‌ ఆదివారం సంయుక్తంగా ఈ వివరాలను ప్రకటించాయి.

నేడు భూపేంద్ర ప్రమాణం

గుజరాత్‌ 18వ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్‌ సోమవారం రెండో పర్యాయం ప్రమాణస్వీకారం చేయనున్నారు. గాంధీనగర్‌లోని సెక్రటేరియట్‌లో మధ్యాహ్నం 2గంటలకు గవర్నర్‌ ఆచార్య దేవవ్రత్‌ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్రహోంమంత్రి అమిత్‌షా, పలు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. భూపేంద్రతో పాటు పలువురు మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Updated Date - 2022-12-12T05:22:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising