ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నొయిడాలో నలుగురు Beef స్మగ్లర్ల అరెస్టు...

ABN, First Publish Date - 2022-06-13T21:50:50+05:30

బీఫ్ స్మగ్లింగ్ (Beef smuggling) చేస్తున్న యూపీకి చెందిన నలుగురు వ్యక్తులను నొయిడా పోలీసులు ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: బీఫ్ స్మగ్లింగ్ (Beef smuggling) చేస్తున్నపశ్చిమ యూపీకి చెందిన నలుగురు వ్యక్తులను నొయిడా పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో అరెస్టు చేసిన ఈ నలుగురికిపై జాతీయ భద్రతా చట్టం (NSA) కింద కేసు నమోదు చేసే అవకాశం ఉంది. సెక్టార్ 62లో ఆదివారం రాత్రి పోలీసుల తనిఖీల్లో 150 కేజీల బీఫ్‌ను స్వాధీనం చేసుకున్నారు.


కాగా, అక్రమంగా బీఫ్ స్మగ్లింగ్ చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అక్కడికక్కడే అరెస్టు చేయగా, తప్పించుకుని పారిపోయిన నాలుగో వ్యక్తిని సోమవారం ఉదయం పట్టుకున్నామని అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (నొయిడా) చెప్పారు. సెక్టార్ 62లోని డీ-పార్క్ వద్ద నాలుగో వ్యక్తిని పోలీసులు చుట్టుముట్టడంతో అతనుమరోసారి కాల్పులు జరుపుతూ తప్పించుకునే ప్రయత్నం చేశాడని, పోలీసుల ఎదురు కాల్పుల్లో అతని కాలిగి గాయమైందని, వెంటనే ఆసుపత్రిలో చేర్చామని చెప్పారు. ఈ నలుగురు వ్యక్తులు నేరచరిత్ర కలిగిన వ్యక్తులని, గజియాబాద్, గౌతం బుద్ధ్ నగర్ సహా పలు చోట్ల వీరిపై ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయని అన్నారు. పశువధ, స్మగ్లింగ్‌ కార్యకలాపాలు చేస్తుంటామని పోలీసు విచారణలో నిందితులు అంగీకరించారని, బీఫ్‌ను ఢిల్లీలోని ఘజియాపూర్ మార్కెట్లో అమ్ముతుంటామని చెప్పారని డీసీపీ తెలిపారు. ఉత్తరప్రదేశ్ పశువధ నిషేధ చట్టం-2020 ప్రకారం, యూపీలో పశువుల వధకు పాల్పడే వారికి ఏడేళ్ల జైలు శిక్ష, రూ.3 లక్షల జరిమానా విధిస్తారు. యూపీలో ప్రస్తుతం 168 మంది ''యానిమల్ మాఫియా'' చురుకుగా ఉన్నట్టు యూపీ పోలీసులు ఇటీవల గుర్తించారు.

Updated Date - 2022-06-13T21:50:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising