ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

36 మంది విద్యార్థులకు అస్వస్థత

ABN, First Publish Date - 2022-06-12T16:25:21+05:30

గదగ జిల్లా ముండరగి తాలుకాలోని ముండవాడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం మధ్యాహ్నం భోజనం చేసిన అనంతరం 36 మంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                             - విచారణకు మంత్రి ఆదేశం


బెంగళూరు, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): గదగ జిల్లా ముండరగి తాలుకాలోని ముండవాడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం మధ్యాహ్నం భోజనం చేసిన అనంతరం 36 మంది విద్యార్ధులు వాంతులు విరోచనాలు చేసుకోవడంతో వీరిని తక్షణం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సలు నిర్వహించారు. కలుషిత ఆహారం సేవించడం వల్లే ఇలా జరిగిందని వైద్యులు తెలిపారు. విద్యార్ధులెవరికీ ప్రాణాపాయం లేదని అందరూ కోలుకుంటున్నారని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారి డా.కీర్తిహాస వెల్లడించారు. కాగా ఈ ఘటనపై ప్రాధమిక విద్యాశాఖా మంత్రి బిసి.నాగేష్‌ శాఖాపరమైన దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేశారు. మధ్యాహ్న భోజన శాలలను పరిశుభ్రంగా ఉంచాలని విద్యార్ధుల ఆరోగ్య సంరక్షణపై పూర్తి స్థాయిలో శ్రద్ధ వహించాలని విద్యాశాఖాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 

Updated Date - 2022-06-12T16:25:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising