ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Russia-Ukraine war: ఒక్క రోజులో 3వేల మందిని తరలించిన భారత్

ABN, First Publish Date - 2022-03-04T02:09:46+05:30

ఇప్పటి వరకు 18 వేల మంది భారతీయులు ఉక్రెయిన్‌ను విడిచిపెట్టారు. ఉక్రెయిన్‌లోని భారతీయులను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై రష్యా బాంబులు, క్షిపణులతో విరుచుకుపడుతున్న వేళ అప్రమత్తమైన భారత ప్రభుత్వం అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను వేగంగా స్వదేశానికి తరలిస్తోంది. నేడు ఒక్క రోజే ఏకంగా 15 విమానాల్లో 3వేల మందిని తరలించింది.


ఇప్పటి వరకు 18 వేల మంది భారతీయులు ఉక్రెయిన్‌ను విడిచిపెట్టారు. ఉక్రెయిన్‌లోని భారతీయులను సురక్షితంగా తరలించేందుకు భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ గంగ’లో భాగంగా ఇప్పటి వరకు 30 విమానాల్లో 6,400 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. మరో 24 గంటల్లో 18 విమానాలు రానున్నట్టు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు.


ఉక్రెయిన్ సరిహద్దులు దాటి పొరుగుదేశాల్లో ఉన్న భారతీయులను వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకొస్తామని చెప్పారు. మరిన్ని విమానాలను పంపిస్తామని, రెండు మూడు రోజుల్లో మరింతమంది ఇండియన్లు వెనక్కి వస్తారని బాగ్చి వివరించారు.


ఇప్పటి వరకు 20 వేల మంది ఇండియన్లు రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని, కానీ చేసుకోనివారు కూడా చాలామందే ఉన్నారని బాగ్చి తెలిపారు. ఖార్కివ్‌లోనే ఇంకా కొన్ని వందలమంది ఉన్నట్టు అంచనా వేశామన్నారు. విద్యార్థులను క్షేమంగా వెనక్కి తీసుకురావడమే తమ లక్ష్యమని అన్నారు.  

Updated Date - 2022-03-04T02:09:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising