ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Secret meet: నితీష్‌ను కలుసుకున్న పీకే... 2 గంటల సేపు సమావేశం

ABN, First Publish Date - 2022-09-14T19:57:28+05:30

రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. అలాంటి అనూహ్య పరిణామమే తాజాగా చోటుచేసుకుంది. బీహార్ సీఎం నితీష్‌ కుమార్‌‌ (Nitish kumar)పై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాట్నా: రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. అలాంటి అనూహ్య పరిణామమే తాజాగా చోటుచేసుకుంది. బీహార్ సీఎం నితీష్‌ కుమార్‌‌ (Nitish kumar)పై విమర్శలు గుప్పించే పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) అనూహ్యంగా బుధవారంనాడు పాట్నాలో నితీష్‌ను కులసుకున్నారు. వీరి సమావేశం సుమారు 2 గంటల సేపు జరిగినట్టు తెలుస్తోంది. మాజీ ఎంపీ పవన్ వర్మ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నట్టు చెబుతున్నారు. వీరి సమావేశం ఎజెండా కానీ, ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయనేది కానీ వెంటనే తెలియలేదు.


ప్రశాంత్ కిషోర్ గతంలో జేడీయూ తరఫున ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించి 2015 అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ విజయానికి దోహదపడ్డారు. జేడీయూలో చేరి కొద్దికాలం తర్వాత ఆ పార్టీకి ఉద్వాసన చెప్పారు. గత కొద్ది నెలలుగా నితీష్‌పై వరుస విమర్శలు గుప్పిస్తున్నారు. పార్టీలతో పొత్తులు తరచు మార్చడంలో నితీష్ సిద్ధహస్తుడనీ, బీజేపీకి ఉద్వాసన చెప్పి ఆర్జేడీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన నితీష్ తిరిగి పొత్తులు మార్చరనే గ్యారెంటీ ఏమీ లేదని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న రూపంలో (జేడీయూ ప్లస్ ఆర్జేడీ) నితీష్ వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లే అవకాశం లేదని కూడా వ్యాఖ్యానించారు.


దీనికి ముందు పీకేపై నితీష్ విమర్శలు గుప్పించారు. తన నాయకత్వంలో ప్రభుత్వ పాలన గురించి కానీ, చేసిన పనుల గురించి కానీ ఏబీసీలు (ABC) కూడా ప్రశాంత్ కిషోర్‌కు తెలియమని నితీష్ విమర్శించారు. దీనిపై పీకే వెంటనే కౌంటర్ ఇచ్చారు. బహుశా ఆయన ఒక్కరే చదువుకున్న వ్యక్తి కావచ్చని, అందువల్లే తన వంటి వాళ్లకు ఏబీసీలు తెలియవంటున్నారని, బహుశా ఆయనకు ఏ టు జడ్ తెలిసి ఉండొచ్చని అన్నారు. అభివృద్ధి పరంగా అట్టడుగు స్థానంలో బీహార్ ఉందని లెక్కలు చెబుతున్న నీతి ఆయోగ్‌తో ఆయన తెలివితేటలు పంచుకుంటే బాగుంటుందంటూ నితీష్‌పై విసుర్లు విసిరారు. గత వారమే ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో పీకే మరోసారి నితీష్‌పై విరుచుకుపడుతున్నారు. మళ్లీ ఆయన పొత్తులు మార్చరనే గ్యారెంటీ ఏదీ లేదన్నారు. బీహార్‌లో ఏ ఒక్కరూ దానిపై గ్యారెంటీ ఇవ్వలేరని అన్నారు. ఆఖరుకు నితీష్ కుడా దానిని భరోసా ఇవ్వలేరని విమర్శించారు.

Updated Date - 2022-09-14T19:57:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising