ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

24న Gudur వరకే పినాకినీ Express

ABN, First Publish Date - 2022-05-21T15:58:43+05:30

రైలు మార్గాల్లో చేపట్టనున్న మరమ్మతుల కారణంగా ఈ నెల 24న పినాకినీ ఎక్స్‌ప్రెస్‌ గూడూరు వరకు మాత్రమే నడువనుంది. ఈ మేరకు దక్షిణ రైల్వే విడుదల చేసిన ప్రకటన వివరాలు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                   - పలు ఎక్స్‌ప్రెస్‌ రైలు సేవల్లో మార్పులు


పెరంబూర్‌(చెన్నై): రైలు మార్గాల్లో చేపట్టనున్న మరమ్మతుల కారణంగా ఈ నెల 24న పినాకినీ ఎక్స్‌ప్రెస్‌ గూడూరు వరకు మాత్రమే నడువనుంది. ఈ మేరకు దక్షిణ రైల్వే విడుదల చేసిన ప్రకటన వివరాలు.

- నెం.12711 విజయవాడ- డా.ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ పినాకినీ ఎక్స్‌ప్రెస్‌ చెన్నై సెంట్రల్‌కు బదులుగా గూడూరు వరకు మాత్రమే నడుస్తుంది. అదే రోజున నెం.12712 చెన్నై సెంట్రల్‌-విజయవాడ పినాకినీ ఎక్స్‌ప్రెస్‌ చెన్నై సెంట్రల్‌కు బదులు గూడూరు నుంచి సాయంత్రం 4.20 గంటలకు బయల్దేరనుంది.

- నెం.16054/16053 తిరుపతి-డా.ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఈ నెల 24,25,31, జూన్‌ 1,7,8 తేదీల్లో ఇరుమార్గాల్లో రద్దు చేశారు.

- నెం.12607 డా.ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌-కేఎస్ఆర్‌ బెంగళూరు లాల్‌ బాగ్‌ ఎక్స్‌ప్రెస్‌ ఈ నెల 24,25,31 జూన్‌ 1,7,8 తేదీల్లో చెన్నై సెంట్రల్‌కు బదులుగా కాట్పాడి నుంచి సాయంత్రం 5.35 గంటలకు బయల్దేరుతుంది. అలాగే, నెం.12608 కేఎస్ఆర్‌ బెంగళూరు-డా.ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌కు ఉదయం 6.20 గంటలకు బయల్దేరే లాల్‌బాగ్‌ ఎక్స్‌ప్రెస్‌ ఈ నెల 24,25,31 జూన్‌ 1,7,8 తేదీల్లో చెన్నై సెంట్రల్‌కు బదులుగా కాట్పాడి వరకు మాత్రమే నడుపనున్నారు.

- నెం.12679 డా.ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌-కోయంబత్తూర్‌ ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌ ఈ నెల 24,25,31, జూన్‌ 1,7,8 తేదీల్లో చెన్నై సెంట్రల్‌కు బదులుగా కాట్పాడి నుంచి సాయంత్రం 4.20 గంటలకు బయల్దేరుతుంది. అలాగే, నెం.12680 కోయంబత్తూర్‌ జంక్షన్‌-డా.ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌కు ఉదయం 6.16 గంటలకు బయల్దేరే ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ ఈ నెల 24,25,31 జూన్‌ 1,7,8 తేదీల్లో చెన్నై సెంట్రల్‌కు బదులుగా కాట్పాడి వరకు మాత్రమే నడుస్తుంది. 

- నెం.12609 డా.ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌-మైసూర్‌కు మధ్యాహ్నం 1.35 గంటలకు బయల్దేరే సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు చెన్నైకు బదులుగా కాట్పాడి నుంచి మధ్యాహ్నం 3.45 గంటలకు బయల్దేరుతుంది. అలాగే, నెం.12610 మైసూరు-డా.ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌కు తెల్లవారుజామున 5 గంటలకు బయల్దేరే సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ ఈ నెల 24,25,31, జూన్‌ 1,7,8 తేదీల్లో చెన్నై సెంట్రల్‌కు బదులుగా కాట్పాడి వరకు మాత్రమే నడుస్తుంది.


నెల్లూరు-సూళ్లూరుపేట సబర్బన్‌ రైళ్లు

 నెల్లూరు నుంచి సూళ్లూరుపేటకు ఉదయం 10.15 గంటలకు బయలుదేరే, సూళ్లూరుపేట నుంచి నెల్లూరుకు ఉదయం 7.50 గంటలకు బయలుదేరే, మూర్‌ మార్కెట్‌ కాంప్లెక్స్‌ నుంచి సూళ్లూరుపేటకు ఉదయం 5.20 గంటలకు బయలుదేరే, సూళ్లూరుపేట నుంచి మూర్‌ మార్కెట్‌ కాంప్లెక్స్‌కు  మధ్యాహ్నం 12.35 గంటలకు బయల్దేరే సబర్బన్‌ రైళ్లు ఈ నెల 24న రద్దు చేశారు.

Updated Date - 2022-05-21T15:58:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising