ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇరాక్‌లో 23 మంది కుర్దు తీవ్రవాదులు హతం

ABN, First Publish Date - 2022-10-03T09:11:55+05:30

ఉత్తర ఇరాక్‌లో 23 మంది కుర్దు తీవ్రవాదులను వైమానిక దాడుల ద్వారా హతమార్చినట్టు టర్కీ ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎఫ్‌-16 యుద్ధ విమానాలతో దాడులు చేసిన టర్కీ

ఇస్తాంబుల్‌, అక్టోబరు 2: ఉత్తర ఇరాక్‌లో 23 మంది కుర్దు తీవ్రవాదులను వైమానిక దాడుల ద్వారా హతమార్చినట్టు టర్కీ ప్రకటించింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని టర్కీ రక్షణ శాఖ పేర్కొంది. ఈ ఆపరేషన్‌లో భాగంగా టర్కీకి చెందిన ఎఫ్‌-16 యుద్ధ విమానాలు 140 కిలోమీటర్ల మేర ఇరాక్‌ భూభాగం లోపలికి ప్రవేశించాయి. ఉత్తర ఇరాక్‌లోని ఎసోస్‌ ప్రాంతంలో కుర్దులు స్వయం ప్రతిపత్తి ప్రకటించుకున్నారు. కుర్దిస్తాన్‌ రీజనల్‌ గవర్నమెంట్‌ పేరుతో అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. ఈ ప్రాంతంలో మొత్తం 16 లక్ష్యాల మీద టర్కీ దాడులు చేసింది. కుర్దిస్తాన్‌ వర్కర్స్‌ పార్టీకి చెందిన సాయుధ దళాలు టర్కీ మీద దాడులకు పాల్పడకుండా నిరోధించడమే ప్రస్తుత ఆపరేషన్‌ లక్ష్యమని టర్కీ రక్షణ మంత్రి తెలిపారు. 2019 నుంచి కుర్దుల ప్రాబల్య ప్రాంతాలపై టర్కీ దాడులు నిర్వహిస్తోంది.

Updated Date - 2022-10-03T09:11:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising