ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bihar Rains : పిడుగుపాటుకు 20 మంది మృతి

ABN, First Publish Date - 2022-07-27T18:09:18+05:30

బిహార్ (Bihar)లో భారీ వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం అతలాకుతలమవుతోంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాట్నా : బిహార్ (Bihar)లో భారీ వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం అతలాకుతలమవుతోంది. ఎనిమిది జిల్లాల్లో సోమవారం సాయంత్రం నుంచి 48 గంటల్లో పిడుగుపాటుకు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Nitish Kumar) ప్రగాఢ సంతాపం తెలిపారు. 


పిడుగుపాటు వల్ల కైమూర్ జిల్లాలో ఏడుగురు, పాట్నా, భోజ్‌పూర్ జిల్లాల్లో నలుగురు చొప్పున, జహానాబాద్, ఆర్వాల్, రోహ్‌తాస్, ఔరంగాబాద్, సివన్ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబాలకు సీఎం నితీశ్ కుమార్ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఒక్కొక్క కుటుంబానికి రూ.4 లక్షలు చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. భారీ వర్షాలు కురుస్తున్నందువల్ల ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రజలను కోరారు. 


పాట్నాలోని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, గడచిన 24 గంటల్లో రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. జూలై 30 వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. ఈ వారంలో రాష్ట్రంలోని అత్యధిక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారి కామిని కుమారి చెప్పారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు విస్తారంగా కురవడంతోపాటు పిడుగులు పడే అవకాశం కూడా ఉందన్నారు. 


Updated Date - 2022-07-27T18:09:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising