ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏప్రిల్-జూన్‌లో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం: ప్రభుత్వం

ABN, First Publish Date - 2022-01-10T18:45:57+05:30

నిర్మాణం, తయారీ, ట్రేడ్, రవాణా, విద్య, ఆరోగ్యం, రెస్టారెంట్, ఐటీ/బీపీఓ, ఆర్థిక కార్యకలాపాలు ఈ తొమ్మిది రంగాలను ప్రధానంగా తీసుకుని సర్వే చేసినట్లు కార్మిక శాఖ పేర్కొంది. అయితే కేంద్రం విడుదల చేసిన..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: పోయిన ఏడాది రెండో త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) రెండు లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చినట్లు కేంద్ర కార్మిక శాఖ విడుదల చేసిన త్రైమాసిక సర్వేలో వెల్లడైంది. దీంతో 2021-2022 ఆర్థిక సంవత్సరంలో ఎంపిక చేయబడ్డ తొమ్మది రంగాల్లో ఉపాధి కల్పన 3.10 కోట్లకు చేరినట్లు పేర్కొన్నారు. ఈ సర్వే వివరాలను కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ సోమవారం విడుదల చేశారు. కొవిడ్ కారణంగా ఉద్యోగ కల్పనపై తీవ్ర ప్రభావం పడిందని, దానిని తట్టుకుని నిలబడి ఉద్యోగ కల్పన కోసం ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని ఈ సందర్భంగా భూపేంద్ర యాదవ్ అన్నారు.


నిర్మాణం, తయారీ, ట్రేడ్, రవాణా, విద్య, ఆరోగ్యం, రెస్టారెంట్, ఐటీ/బీపీఓ, ఆర్థిక కార్యకలాపాలు ఈ తొమ్మిది రంగాలను ప్రధానంగా తీసుకుని సర్వే చేసినట్లు కార్మిక శాఖ పేర్కొంది. అయితే కేంద్రం విడుదల చేసిన ఈ సర్వేపై నిరుద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దేశంలో కోట్ల మంది రేషన్ తీసుకునే అర్హులు ఉంటే ప్రభుత్వం కేవలం 2 లక్షల ఉద్యోగాలు మాత్రమే కల్పించిందని పెదవి విరుస్తున్నారు. కొందరు అయితే 2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన హామీని గుర్తు చేస్తున్నారు.

Updated Date - 2022-01-10T18:45:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising