ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉక్రెయిన్‌లోని భారతీయుల కోసం రెండు విమానాలు.. మొత్తం ఖర్చులు భరిస్తామన్న ప్రభుత్వం

ABN, First Publish Date - 2022-02-25T23:26:29+05:30

యుద్ధం కారణంగా భీతావహంగా మారిన ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలించేందుకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: యుద్ధం కారణంగా భీతావహంగా మారిన ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలించేందుకు విమానాలు రెడీ అవుతున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించిన మొత్తం ఖర్చును ప్రభుత్వమే భరించాలని నిర్ణయించింది. ఉక్రెయిన్‌లో దాదాపు 16 వేల మంది భారతీయులు చిక్కుకుపోయినట్టు అంచనా.


ఉక్రెయిన్ నుంచి భారతీయులను తరలించేందుకు రెండు విమానాలను పంపించనున్నారు. తరలింపునకు సంబంధించి తదుపరి వ్యూహాల రూపకల్పనపై చర్చించేందుకు కేబినెట్ కమిటీ రేపు (శనివారం) మధ్యాహ్నం సమావేశం కానుంది. ఈ విమానాలు నేటి రాత్రి రొమేనియాకు బయలుదేరి రేపు (మంగళవారం) భారతీయులతో తిరిగి రావాల్సి ఉంది. 


ఉక్రెయిన్ తన గగనతలాన్ని మూసేసిన తర్వాత భారత్ తన పౌరులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు అనేక చర్యలు చేపట్టింది. భారతీయుల తరలింపులో సాయం చేసేందుకు ఉక్రెయిన్ సరిహద్దులైన హంగేరీ, పోలండ్, స్లోవక్ రిపబ్లిక్, రొమేనియాలకు బృందాలను పంపనున్నట్టు గత సాయంత్రం విదేశాంగ కార్యాలయం ప్రకటించింది. 

Updated Date - 2022-02-25T23:26:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising