1971 యుద్ధ వీరుడు భైరోన్‌సింగ్ మృతి
ABN, First Publish Date - 2022-12-20T00:50:54+05:30
పాకిస్థాన్‌తో 1971లో జరిగిన యుద్ధంలో రాజస్థాన్‌లోని లొంగెన్‌వాలా పాస్ వద్ద అనంత ధైర్యసాహసాలను ప్రదర్శించి పాక్ సైనికులను
న్యూఢిల్లీ, డిసెంబరు 19: పాకిస్థాన్‌తో 1971లో జరిగిన యుద్ధంలో రాజస్థాన్‌లోని లొంగెన్‌వాలా పాస్ వద్ద అనంత ధైర్యసాహసాలను ప్రదర్శించి పాక్ సైనికులను గడగడలాడించిన వీరుడు భైరోన్‌సింగ్ రాథోడ్ ఆదివారం తుదిశ్వాస విడిచారు. చాలాకాలం నుంచి పక్షవాతంతో బాధపడుతున్న ఆయన బ్రెయిన్ డెడ్‌తో మృతి చెందినట్లు ఆయన కుమారుడు తెలిపారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా, రక్షణమంత్రి రాజ్‌నాధ్ ఆయన మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు.
Updated Date - 2022-12-20T00:50:55+05:30 IST