ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rains: 18 జిల్లాలకు వర్ష సూచన

ABN, First Publish Date - 2022-09-09T13:54:12+05:30

ఉత్తర తమిళనాడు ప్రాంతానికి సమీపంలో ఏర్పడివున్న ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం కారణంగా తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కాల్‌ ప్రాంతాల్లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అడయార్‌(చెన్నై), సెప్టెంబరు 8: ఉత్తర తమిళనాడు ప్రాంతానికి సమీపంలో ఏర్పడివున్న ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం కారణంగా తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కాల్‌ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నై(Chennai) వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ కారణంగా నీలగిరి, కోయంబత్తూరు, తిరుపూరు, తేని, దిండిగల్‌, ఈరోడ్‌, కృష్ణగిరి, ధర్మపురి, సేలం, కళ్లకుర్చి, తిరువణ్ణామలై, వేలూరు, రాణిపేట, తిరుపత్తూరు, తిరువళ్ళూరు, కాంచీపురం, కడలూరు, విల్లుపురం జిల్లాలతో పాటు పుదుచ్చేరి, కారైక్కాల్‌ ప్రాంతాలో తేలిక పాటి నుంచి ఒక మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. చెన్నై నగరం(Chennai city)లో వచ్చే 24 గంటల పాటు ఆకాశం మేఘావృతమై ఉంటుందని, నగరంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షపు జల్లులు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. 

Updated Date - 2022-09-09T13:54:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising