ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వందకు 151 మార్కులు

ABN, First Publish Date - 2022-08-01T08:23:24+05:30

ఓ డిగ్రీ విద్యార్థి బీఏ హానర్స్‌ పొలిటికల్‌ సైన్స్‌ పేపర్‌లో వందకు 151 మార్కులు సాధించాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బిహార్‌లోని ఓ వర్సిటీ డిగ్రీ పరీక్షల్లో వింత

దర్భంగా, జూలై 31 : ఓ డిగ్రీ విద్యార్థి బీఏ హానర్స్‌ పొలిటికల్‌ సైన్స్‌ పేపర్‌లో వందకు 151 మార్కులు సాధించాడు. ఏంటి? వందకు నూట యాభై ఒకటా? అది ఎలా సాధ్యమని షాకయ్యారా ? మీరే కాదు.. తన మార్కు షీట్‌ చూసుకున్న ఆ విద్యార్థి మీకంటే ఎక్కువగానే బిత్తరపోయాడు. బిహార్‌, దర్భంగా జిల్లాలోని లలిత్‌ నారాయణ్‌ మిథిల విశ్వవిద్యాలయం(ఎల్‌ఎన్‌ఎంయూ)లో ఈ వింత జరిగింది. ఆ విద్యార్థి చాయిస్‌ రాశాడోనో, చేతి రాత బాగుందనో అదనపు మార్కులు వెయ్యలేదు. టైపింగ్‌ దోషం వల్ల అతని ప్రొవిజనల్‌ మార్కుషీట్‌లో మార్కులు తప్పుగా ముద్రణ అయ్యాయి. ఇదిలా ఉండగా, అకౌంట్స్‌ అండ్‌ ఫైనాన్స్‌ పేపర్‌-4లో సున్నా మార్కులు పొంది పరీక్షల్లో తప్పినఓ బీకామ్‌ విద్యార్థిని తదుపరి గ్రేడ్‌కు ప్రమోట్‌ చేసేశారు. ఈ రెండు విషయాలు తెలిసి ఆ వర్సిటీ విద్యార్థుల్లో ఒకింత కలకలం రేగింది. దీంతో, ఈ రెండు ఘటనలు టైపింగ్‌ దోషం వల్ల జరిగిన పొరపాట్లని, ఆ విద్యార్థులకు సవరించిన మార్కు షీట్లు అందజేశామని ఎల్‌ఎన్‌ఎంయూ రిజిస్ట్రార్‌ ముస్తాక్‌ అహ్మద్‌ వివరణ ఇచ్చుకున్నారు.  

Updated Date - 2022-08-01T08:23:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising