ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

death sentence : 15 మందికి ఉరిశిక్ష .. చేసిన నేరం ఇదే..

ABN, First Publish Date - 2022-08-18T21:35:32+05:30

జైలులో సహచర ఖైదీ హత్యకు పాల్పడ్డ 15 మంది దోషులకు మరణశిక్షపడింది(death sentence).

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జెంషెడ్‌పూర్ : జైలు(Jail)లో సహచర ఖైదీ(Inmate) హత్య(murder) కేసులో దోషులుగా తేలిన 15 మంది ఖైదీలకు మరణశిక్షపడింది(death sentence). ఉరి తీయాలని జార్ఖండ్‌(Jharkhand )లోని ఈస్ట్ సింగ్భమ్ జిల్లా అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి రాజేందర్ కుమార్ సిన్హా ఈ మేరకు తీర్పునిచ్చారు. ఐపీసీ సెక్షన్లు 302(హత్య), 120బీ(నేరపూరిత కుట్ర) కింద వీళ్లంతా దోషులుగా తేలడంతో ఈ శిక్ష పడిందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజీవ్ కుమార్ తెలిపారు. ఇదే కేసులో మరో ఏడుగురికి 10 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ కోర్టు నిర్ణయించిందని ఆయన వెల్లడించారు.


కాగా జూన్ 25, 2019న జైళ్లోని 2 ఖైదీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పరస్పర దాడిలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. హాస్పిటల్‌కు తరలిస్తుండగా మనోజ్ కుమార్ సింగ్ అనే ఖైదీ మార్గమధ్యంలోనే చనిపోయాడు. ఈ హింసాత్మక ఘటనపై పర్సుదిహ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. మరోవైపు ఈ కేసులో ఇద్దరు ఖైదీలు పరారీలో ఉన్నారు. వీరిని వెతికి పట్టుకుని న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టాలని జార్ఖండ్ డీజీపీకి కోర్టు ఆదేశాలిచ్చింది. కాగా నిందితుల కోసం గాలింపు కొనసాగుతోందని వెల్లడించారు.

Updated Date - 2022-08-18T21:35:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising