ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

CM orders: ప్రాణనష్టం జరగకూడదు

ABN, First Publish Date - 2022-08-05T12:47:41+05:30

కావేరి పరీవాహక ప్రాంతాలకు వరద ముప్పు ఏర్పడిన నేపథ్యంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకుండా చర్యలు చేపట్టాలని సీఎం స్టాలిన్‌(CM

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- తక్షణం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టండి

- అధికార యంత్రాంగాన్ని రంగంలోకి దింపండి

- లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించండి

- 14 జిల్లాల కలెక్టర్లకు సీఎం ఆదేశం 


చెన్నై, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): కావేరి పరీవాహక ప్రాంతాలకు వరద ముప్పు ఏర్పడిన నేపథ్యంలో  ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకుండా చర్యలు చేపట్టాలని సీఎం స్టాలిన్‌(CM Stalin) ఆదేశించారు. కావేరి వరదల నేపథ్యంలో స్టాలిన్‌ హూటాహుటిన అధికారులతో సమావేశమయ్యారు. అందుబాటులో వున్న మంత్రులు, ఉన్నతాధికారులతో ఆయన సచివాలయం(Secretariat)లో భేటీ అయి పరిస్థితి సమీక్షించారు. 14 జిల్లాల కలెక్టర్లతో(With 14 District Collectors) వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సేలం, నామక్కల్‌ తిరుచ్చి, కరూరు, తంజావూ రు, అరియలూరు, మైలాడుదురై, నాగపట్టినం, ఈరోడ్‌, తిరువారూరు, కడలూరు, తిరుప్పూరు  జిల్లాల కలెక్టర్లతో ఆయన మాట్లాడారు. ఎక్కడికక్కడ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని, లోతట్టు ప్రాం తాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, వారికి ఆహార పానీయాలు అందించాలన్నారు. ఎక్కడికక్కడ వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన వారికి మందులు అందజేయాలన్నారు. బాధితులకు ఎలాంటి కొరత రానీయరాదన్నారు. ఆయా జిల్లాల్లో చెరువులు, జలాశయాలు, వాగుల్లో నీటి ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ఈ సమావేశంలో మంత్రులు దురైమురుగన్‌, కేకేఎస్ఎస్ఆర్‌ రామచంద్రన్‌, డీజీపై శైలేంద్రబాబు పాల్గొన్నారు. కాగా వరద బాధిత ప్రాంతాల్లో వుండి, సహాయక చర్యల్ని సమీక్షించాలని ఆయా జిల్లాల మంత్రులు, ఇతర నేతలను సీఎం ఆదేశించారు.

Updated Date - 2022-08-05T12:47:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising