ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐఐటీలో 145కు చేరిన Covid కేసులు

ABN, First Publish Date - 2022-04-28T13:14:50+05:30

చెన్నై ఐఐటీలో కొవిడ్‌ కేసుల సంఖ్య 145కు చేరింది. ఈ నెల 19వ తేది ఒక విద్యార్థికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా, అనంతరం విద్యార్థులు, సిబ్బందికి ఆరోగ్యశాఖ అధికారులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెరంబూర్‌(చెన్నై): చెన్నై ఐఐటీలో కొవిడ్‌ కేసుల సంఖ్య 145కు చేరింది. ఈ నెల 19వ తేది ఒక విద్యార్థికి  పాజిటివ్‌ నిర్ధారణ కాగా, అనంతరం విద్యార్థులు, సిబ్బందికి ఆరోగ్యశాఖ అధికారులు కరోనా పరీక్షలు నిర్వహించారు. 20న, 21 తేదీల్లో కలిపి మొత్తం 112 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో, ఐఐటీలోని విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది 4,974 మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా, బుధవారం 2,729 మంది ఫలితాలు వచ్చాయి. అందులో మరో 33 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా, ఐఐటీలో మొత్తం కేసుల సంఖ్య 145కు చేరింది. కాగా, వీరిలో తొలివిడతగా 25 మంది రక్తనామూనాలు ల్యాబ్‌కు పంపగా, బుధవారం వచ్చిన ఫలితాల్లో కొత్త వైరస్‌ లక్షణాలు కల్పించలేదు. ఇప్పటికే రాష్ట్రంలో 93 శాతం మందికి ఒమైక్రాన్‌ బిఏ2 రకం వైరస్‌ లక్షణాలున్న నేపధ్యంలో, ఐఐటీలో 25 మందికి అవే లక్షణాలున్నట్లు తేలిందని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.

Updated Date - 2022-04-28T13:14:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising